Anchor Suma Family: బుల్లితెరపై మకుటంలేని మహారాణి గా కొనసాగుతోంది సుమ కనకాల. సీరియల్ నటి గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత యాంకర్ గా ప్రఖ్యాత పొందారు. డిఫరెంట్ యాక్షన్ తో మహిళా ప్రేక్షకులకు దగ్గరైన సుమ సినిమాల్లోనూ నటించారు. అయితే సినిమాల కంటే టీవీల్లో యాంకర్ గానే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఈటీలో ఆమె చేసిన ‘స్టార్ మహిళ’తో క్రేజ్ సంపాదించుకుంది. సుమ మాత్రమే కాకుండా ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా నటుడు. అంతేకాకుండా ఆమె మామ దేవదాస్ కనకాల కూడా ఇండస్ట్రీలో కొనసాగిన వారే. అయితే ఇప్పుడు ఆమె కుమారులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
సినీ ఇండస్ట్రీలోకి బంధుత్వంతో వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కొన్ని కుటుంబాలకు చెందిన నటులు తమ బంధువులను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి వారిని సక్సెస్ చేయిస్తున్నాయి. ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు నటులు పరిశ్రమలోకి వచ్చారు. కానీ యాంకర్ సుమ ఫ్యామిలీలో మాత్రం ఎక్కువ మంది నటులు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అలనాడు సీరియళ్ల ద్వారా ఎంట్రీ ఇచ్చిన దేవదాసు కనకాల తన ద్వారా కొడుకు రాజీవ్ కనకాల, కోడలు సుమలు పరిశ్రమలో కొనసాగుతున్నారు.
సుమ కనకాల 1974 మార్చి 22న కేరళలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా సికింద్రాబాద్ కు వీరి కుటుంబం వచ్చింది. దీంతో సుమ ఇక్కడే తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమెకు 1995 నుంచి సీరియళ్ల లో నటించడం ప్రారంభించింది. ఈ క్రమంలో దేవదాసు కనకాల తీసిన ఓ సీరియల్ లో నటించేందుకు వచ్చిన సుమ.. తనతో పాటు నటించిన రాజీవ్ కనకాల ప్రేమలో పడింది. ఆ తరువాత వీరిద్దరు 1999లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరమైన సుమ ఆ తరువాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తిరుగులేని వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నారు.
సుమ కనకాల ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. కానీ ఆ తరువాత ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ కొన్నిసినిమాల్లో సైడ్ పాత్రల్లో నటించారు. అయితే సినిమాల్లో కంటే టీవీల్లోనే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఈటీవీలో ఆమె చేసిన ‘స్టార్ మహిళ’తో అశేష గుర్తింపు వచ్చింది. ఆ తరువాత సినీ ఫంక్షన్లు, టీవీ షోల్లో పాల్గొంటూ అలరిస్తుంది. ఆమె డైరెక్షన్లో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా కూడా వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
సినిమా ఇండస్ట్రీలో ఎంత బిజీ ఉన్నా సుమ తన ఫ్యామిలీకి ఎంతో ప్రిపరెన్స్ ఇస్తారు. సుమ, రాజీవ్ లకు ఇద్దరు పిల్లలు. వీరిలో కుమారుడు హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. త్వరలోఆయన సినిమాలో నటిస్తారని అనుకుంటున్నారు. కానీ సుమ మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా సుమ ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ గా మారాయి. వీరంతా కలిసి వివిధ ప్రదేశాల్లో దిగిన పిక్స్ సుమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అలరిస్తున్నాయి.