https://oktelugu.com/

Anchor Srimukhi : బరువైన పరువాలతో మతులు పోగొట్టిన యాంకర్ శ్రీముఖి… చోళీ లెహంగాలో ఘాటైన ఫోజులు వైరల్

బిగ్ బాస్ తెలుగు 3లో పాల్గొన్న శ్రీముఖి సత్తా చాటింది. ఏకంగా టైటిల్ కోసం పోటీపడింది. రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి టైటిల్ పోరులో నిలిచారు. రాహుల్ కి సింపతీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఆ దెబ్బతో టైటిల్ విన్నర్ అయ్యాడు.

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2023 / 09:11 PM IST
    Follow us on

    Anchor Srimukhi : శ్రీముఖి ఫేమ్ అంతకంతకు పెరుగుతుంది. ఈ బుల్లితెర రాములమ్మ యాంకర్ గా ఉన్న షోలకు రికార్డు టీఆర్పీ వస్తుంది. ఆదివారం స్టార్ మా పరివార్ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. బార్క్ ఇటీవల విడుదల చేసిన టీఆర్పీ రేటింగ్ లిస్ట్ లో బిగ్ బాస్ తర్వాత మూడో స్థానంలో ఉంది. 4కి పైగా టీఆర్పీ స్టార్ మా పరివార్ షోకి వచ్చింది. ఇది శ్రీముఖి మేనియా ఏమిటో తెలియజేస్తుంది. శ్రీముఖి అనతికాలంలో స్టార్ యాంకర్ అయ్యారు. పటాస్ షోలో మొదలైన ఆమె ప్రస్థానం దిగ్విజయంగా సాగుతుంది.

    శ్రీముఖి మొదట్లో హీరోయిన్ కావాలని అనుకుందట. నటిగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయట. శ్రీముఖిని కొందరు నేరుగా కమిట్మెంట్స్ అడిగారట. లాభం లేదని బుల్లితెర షిఫ్ట్ అయ్యిందట. యాంకర్ రవితో పాటు పటాస్ షోలో శ్రీముఖి యాంకర్ గా కనిపించింది. పటాస్ ఒకింత సక్సెస్ రాబట్టింది. యాంకర్ గా ఎదుగుతున్న రోజుల్లో శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.

    బిగ్ బాస్ తెలుగు 3లో పాల్గొన్న శ్రీముఖి సత్తా చాటింది. ఏకంగా టైటిల్ కోసం పోటీపడింది. రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి టైటిల్ పోరులో నిలిచారు. రాహుల్ కి సింపతీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఆ దెబ్బతో టైటిల్ విన్నర్ అయ్యాడు. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. ఈ షో ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. అలాగే రెమ్యూనరేషన్ రూపంలో బాగానే ఆర్జిందట. అనసూయ యాంకరింగ్ నుండి తప్పుకుంది. సుమ షోల మీద దృష్టి తగ్గించింది. ఈ పరిణామాలు శ్రీముఖికి కలిసొచ్చాయి.

    ఆమె అత్యధిక షోలకు హోస్టింగ్ చేస్తున్నారు. మరోవైపు నటిగా ఎదగాలనేది ఆమె తపన. అందుకే గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా బ్లాక్ కలర్ డిజైనర్ చోళీ లెహంగాలో మైండ్ బ్లాక్ చేసింది. చేతులు పైకి ఎత్తి హాట్ ఫోజుల్లో కాకరేపింది. శ్రీముఖి గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. శ్రీముఖి కెరీర్లో సెటిల్ అయ్యింది. ఆమె సంపాదన కోట్లకు చేరింది. హైదరాబాద్ లో సొంత ఇల్లు నిర్మించుకుంది. హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నా మంచి చిత్రాలు ఎంచుకోవాలని ఎదురుచూస్తుంది. శ్రీముఖి కెరీర్లో మరింత ఎదిగే సూచనలు కలవు.