Anchor Sreemukhi Childhood Pics Goes Viral
Anchor: ఫొటోలో చాలా ముద్దుగా కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ బుజ్జాయి ఇప్పుడు ఒక స్టార్ యాంకర్. బుల్లితెర పై ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమ్మడు హోస్ట్ చేస్తే ఆ షో సూపర్ హిట్ అంతే. తన చలాకితనం, ఎనర్జీ లెవెల్స్ తో ఆడియన్స్ లో జోష్ నింపేస్తుంది. ఒక స్టాండప్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు స్టార్ యాంకర్ హోదా సంపాదించింది. ప్రజెంట్ బుల్లితెర ని ఏలేస్తుంది.
కాగా ఈ క్యూట్ బేబీ ఎవరో కాదు హాట్ యాంకర్ శ్రీముఖి. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘నీతోనే డాన్స్ 2.0’ షో కు శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చిన్ననాటి ఫొటోలతో పాటు .. జడ్జెస్, యాంకర్ ఫోటోలు ప్రదర్శించారు. చిన్నప్పటి ఫోటోలు చూసి మిగతా వాళ్ళు అది ఎవరో కనిపెట్టాలి.
ఈ క్రమంలో శ్రీముఖి చిన్ననాటి ఫోటో స్క్రీన్ పై వేశారు. ఇక ఫోటో చూసిన వెంటనే నయని పావని చెప్పేసింది. ఆ తర్వాత బ్రిట్టో కూడా శ్రీముఖి అని చెప్పాడు. కాగా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న నీతోనే డాన్స్ 2.0 ఫినాలే కి దగ్గరైంది. వచ్చే ఆదివారంతో షో కి ఎండ్ కార్డు పడబోతోంది. ఈ క్రమంలో సీజన్ 2 విన్నర్ ఎవరు అవుతారో అని ఉత్కంఠ నెలకొంది. కానీ ఇప్పటికే ఫినాలే కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది.
Also Read: Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు 8లో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్… మేకర్స్ అంత రిస్క్ చేస్తారా?
దీంతో టైటిల్ విన్నర్ అమర్ – తేజస్విని అని లీక్ బయటకు వచ్చింది. ఇది ఇలా ఉంటే .. శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా లో ఎక్కువగా షోలు, స్పెషల్ ఈవెంట్లు హోస్ట్ చేస్తుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, నీతోనే డాన్స్ 2.0 వంటి షోలు చేస్తుంది. షోలు పరంగా చూస్తే శ్రీముఖి మిగతా యాంకర్స్ కంటే ముందంజలో ఉంది. సుమ ఈ మధ్య నెమ్మదించారు. అనసూయ యాంకరింగ్ మానేసింది. ఇక రష్మీ గౌతమ్ ఈటీవి మాత్రమే పరిమితం అవుతుంది. ఈ పరిణామాలు శ్రీముఖికి కలిసి వస్తున్నాయి.
Web Title: Anchor sreemukhi childhood pics goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com