Anchor Shyamala : టాలీవుడ్ సెలబ్రిటీలపై వరుసగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Anchor Shyamala) కూడా గతం లో బెట్టింగ్ యాప్స్ ని సోషల్ మీడియా ద్వారా విచ్చలవిడిగా చేయడం, అందుకు సంబంధించిన వీడియోలను టీడీపీ, జనసేన పార్టీ అభిమానులు అప్లోడ్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై కేసు నమోదైంది. తనపై నమోదైన FIR ని కొట్టివేయాలంటూ ఆమె తెలంగాణ హై కోర్టు ని ఆశ్రయించింది. అంతే కాకుండా, తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ని కోరింది. కోర్టు దీనిపై విచారణ జరిపి పోలీసులకు శ్యామల ని అరెస్ట్ చెయ్యొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ పోలీసుల విచారణకు మాత్రం సహకరించాలని ఆదేశించింది. అందుకు నేడు ఆమె విచారణకు హాజరు కాబోతున్నట్టు సమాచారం.
Also Read : యాంకర్ శ్యామల చీకటి బాగోతం బయటపెడతా అంటున్న టీడీపీ నేత… ముదిరిన వివాదం!
హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసుల ముందు నేడు ఆమె హాజరు కానుంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇది వరకు యాంకర్ విష్ణు ప్రియ(Anchor Vishnu Priya), రీతూ చౌదరి(Ritu Chowdary) వంటి వారిని విచారించారు పోలీసులు. నేడు యాంకర్ శ్యామల వంతు. మిగిలిన సెలబ్రిటీస్ ని కూడా వరుస క్రమంలో విచారించబోతున్నారు. వీళ్ళతో పాటు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj) వంటి వారిపై కూడా కేసులు నమోదు. వీళ్ళు మాత్రం కాకుండా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన టీడీపీ పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పై, రెబల్ స్టార్ ప్రభాస్(Rebelstar Prabhas), గోపీచంద్ వంటి వారిపై కూడా ఇటీవలే కేసులు నమోదు అయ్యాయి. చిన్నా లేదు, పెద్ద లేదు తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అన్నట్టు వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన అందుకు ఒక ఉదాహరణ.
ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ చేస్తున్న సినీ సెలబ్రిటీలపై ఉక్కుపాదం మోపం స్వాగతించ దగ్గ విషయమే. కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయిన వాళ్లకు సెలబ్రిటీల నుండి డబ్బులు తిరిగి ఇచ్చేలా చేస్తారా లేదా?, కొంతమంది ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరికొంత పెళ్లి కోసం, భవిష్యత్తు ని ఉజ్వలంగా ఉంచుకునేందుకు దాచుకున్న డబ్బులను కూడా బెట్టింగ్ యాప్స్ లో పెట్టి నష్టపోయారు. అలాంటి వాళ్లకు న్యాయం చేకూరుతుందా?, సెలబ్రిటీలను అరెస్ట్ చేస్తే వాళ్లకు ఏమి లాభం చెప్పండి?, భవిష్యత్తులో బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ చేయడం మానేస్తారేమో కానీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయిన వాళ్లకు ఎంతో కొంత నష్టపరిహారం అందిస్తే వాళ్లకు నిజమైన న్యాయం చేసినవాళ్లు అవుతారు. చూడాలి మరి కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది.
Also Read : ఇండస్ట్రీ పై యాంకర్ కమ్ నటి అసంతృప్తి