https://oktelugu.com/

Shekhar Master : హీరోయిన్ తో ఎఫైర్ బయటపెట్టాడు.. శేఖర్ మాస్టర్ సీరియస్ గా వెళ్లిపోయాడు.. వైరల్ వీడియో…

ఇక ఇదే విధంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిని పాటిస్తూ సెలబ్రేటీస్ దొరికితే చాలు ఏదో ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగి వారు చెప్పే సమాధానంతో రాక్షస ఆనందం పొందడమే కాకుండా ప్రేక్షకుల్లో ఫేమస్ అవుతున్నాం అనుకుంటూ ఆనందపడుతు ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 27, 2023 / 10:26 PM IST
    Follow us on

    Shekhar Master : సోషల్ మీడియా వల్ల ముఖ్యంగా యూ ట్యూబ్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఫేమస్ అయిపోదామనే ఉద్దేశ్యం తో ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తూ ఫేమస్ అవ్వాలని చూస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే శివ అనే ఒక యాంకర్ చాలామందిని ఇంటర్వ్యూలు చేసి వారిని పిచ్చి పిచ్చి క్వశన్స్ అడుగుతూ దాని ద్వారా ఎంతో కొంత పాపులారిటి అయితే సంపాదించుకున్నాడు. దాంతో బిగ్ బాస్ షో లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు…

    ఇక ఇదే విధంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిని పాటిస్తూ సెలబ్రేటీస్ దొరికితే చాలు ఏదో ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగి వారు చెప్పే సమాధానంతో రాక్షస ఆనందం పొందడమే కాకుండా ప్రేక్షకుల్లో ఫేమస్ అవుతున్నాం అనుకుంటూ ఆనందపడుతు ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పటికే ఇంటర్వ్యూలు చేసిన చాలామంది సెబ్రిటీస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాను అని అనుకుంటున్నాడు కానీ ప్రేక్షకుల్లో మాత్రం అతని పట్ల ఒక అసహ్య భావన అనేది అయితే ఉంది.ఇక ఇప్పుడు కూడా తను ‘డి సెలబ్రిటీ స్పెషల్ షో’ లో పాల్గొన్నాడు ఇక ఆ షో కి జడ్జ్ గా చేస్తున్న శేఖర్ మాస్టర్ ని టార్గెట్ చేసి మీకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉంది కదా అంటూ క్వశ్చన్ అడిగాడు.

    దాంతో శేఖర్ మాస్టర్ కోపంతో చేతిలో మైక్ ఉంటే ఏది పడితే అది అడిగేస్తావా మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి అంటూ కోపంగా అతని మీద విరుచుకుపడ్డాడు. సెట్లో నుంచి అతన్ని పంపిస్తారా లేదా నేనే వెళ్లిపోనా అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని అడిగి తనే డైరెక్ట్ గా బయటికి వెళ్లిపోయాడు…ఇక ఈమధ్య అయితే శివ మీద చాలామంది సెలబ్రిటీలు చాలా బ్యాడ్ గా స్పందించారు.

    ఒక్క శివ అనే కాదు కొత్త సినిమా ప్రమోషన్ కోసం క్యూ అండ్ ఏ ప్రోగ్రాం ని నిర్వహిస్తుంటే అందులో కొంతమంది రిపోర్టర్లు కూడా స్టార్ హీరోలు, హీరోయిన్లు అని కూడా చూడకుండా ఏది పడితే అది అడిగేస్తు వారిని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంత స్టార్ హీరోలు, హీరోయిన్లు అయిన కూడా వాళ్లకు కూడా ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది దాన్ని మనం టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది సమంజసం కాదు అనే విషయాలను వీళ్ళు తెలుసుకుంటే తప్ప సెలబ్రిటీస్ కి ఇలాంటి భాధలు తప్పవు…