Homeఎంటర్టైన్మెంట్Anchor Shiva Jyothi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ శివ జ్యోతి..ఫోటోలు వైరల్!

Anchor Shiva Jyothi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ శివ జ్యోతి..ఫోటోలు వైరల్!

Anchor Shiva Jyothi: తీన్మార్ వార్తలతో బిత్తిరి సత్తి తో కలిసి న్యూస్ రీడర్ గా వ్యంగ్యాన్ని జోడిస్తే వార్తలు చదువుతూ అప్పట్లో యాంకర్ శివ జ్యోతి(Anchor Shiva Jyothi) ఎంత పాపులారిటీ ని సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయ్యింది. ఇక ఆ తర్వాత ఇప్పటికీ ఈమె అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది. అయితే ఈమధ్య కాలం లో ఈమె బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ విషయం లో లీగల్ గా కొన్ని సమస్యలను ఎగురుకుంటూ, సోషల్ మీడియా లో నెటిజెన్స్ చేత తీవ్రమైన విమర్శలను అందుకుంది. అయినప్పటికీ కూడా నెగటివిటీ ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది శివజ్యోతి.

ఇకపోతే ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈమె ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఈమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఒక శుభ వార్త ని నెటిజెన్స్ తో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘నా భర్త పుట్టినరోజు కి రెండు రోజుల ముందు, అనగా ఫిబ్రవరి 12న నేను పండంటి బిడ్డకు జన్మని ఇవ్వడం నేను జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. త్వరలోనే బిడ్డ జెండర్ ని రివీల్ చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చింది శివ జ్యోతి. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే మగబిడ్డ పుట్టిందా?, లేదా ఆడబిడ్డ పుట్టిందా అనే విషయం ఇప్పుడే చెప్పేయొచ్చు కదా, మళ్లీ అందుకు ప్రత్యేక ముహూర్తం ఎందుకు అంటూ ఈ పోస్ట్ క్రింద కొంతమంది కామెంట్స్ చేశారు. అత్యధిక శాతం మంది ఆమెకు పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

శివజ్యోతి గంగూలీ అనే వ్యక్తిని 2015 వ సంవత్సరం లో పెళ్లాడింది. ఈమె ఇన్ స్టాగ్రామ్ లో అనుసరించే వాళ్లకు, ఆయన సుపరిచితమే. ఇద్దరు కలిసి ఎన్నో రీల్స్ కూడా చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వృత్తి రీత్యా గంగూలీ ఒక ఐటీ ఉద్యోగి. పలు టీవీ షోస్ లో కూడా శివ జ్యోతి తన భర్త తో కలిసి జంటగా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ సమయం లో ఈయన కూడా కొన్ని విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది. మీ భార్య చేసే బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి ,ఆమె అలా చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పి నువ్వైనా ఆపాలి కదా అంటూ గత ఏడాది ఈయన కూడా తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వచ్చింది.

Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
[td_block_15 category_id="_related_tag" custom_title="Related News" ajax_pagination="next_prev" limit="3"]
[td_block_21 custom_title="Most Popular" category_id="_current_cat" review_source="" time_ago_add_txt="" sort="" f_header_font_weight="" f_header_font_transform=""]