తన వీక్ నెస్ బయటపెట్టిన యాంకర్ రష్మీ

‘జబర్ధస్త్’ కామెడీ షో యాంకర్ గా.. ప్రముఖ హీరోయిన్ గా రష్మీ తెలుగు నాట అందరికీ చిరపరిచితమే. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడే రష్మీ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా అప్పుడప్పుడూ అవుతుంటుంది. ఇటీవలే బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘బ్లాక్ బస్టర్’ మూవీ టీజర్ రిలీజైంది. ‘విజయీభవ’ అంటూ ప్రారంభమైన టీజర్ చివరివరకు ఆకట్టుకుంది. 2.06నిమిషాల నిడివితో ఉన్న ‘బ్లాక్ బస్టర్’ టీజర్ ను హీరో శ్రీవిష్ణు విడుదల […]

Written By: NARESH, Updated On : October 2, 2020 4:22 pm

rashmi

Follow us on

‘జబర్ధస్త్’ కామెడీ షో యాంకర్ గా.. ప్రముఖ హీరోయిన్ గా రష్మీ తెలుగు నాట అందరికీ చిరపరిచితమే. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడే రష్మీ వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా అప్పుడప్పుడూ అవుతుంటుంది. ఇటీవలే బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది.

నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘బ్లాక్ బస్టర్’ మూవీ టీజర్ రిలీజైంది. ‘విజయీభవ’ అంటూ ప్రారంభమైన టీజర్ చివరివరకు ఆకట్టుకుంది. 2.06నిమిషాల నిడివితో ఉన్న ‘బ్లాక్ బస్టర్’ టీజర్ ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్టు లుక్ మంచి ఆదరణ పొందగా తాజాగా విడుదల టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

సింగర్ గీతామాధురి భర్త నందు విజయకృష్ణ టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించాడు. హీరోయిన్ గా జబర్ధస్త్ యాంకర్ రష్మీ నటించడం విశేషం. రష్మి బుల్లితెర అభిమానులను అలరిస్తూనే అప్పుడప్పుడు వెండితెరపై హీరోయిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

కాగా ఈ టీజర్ విడుదల సందర్భంగా రష్మీ హాట్ కామెంట్స్ చేసింది. ‘గొడవలు జరుగుతుంటే చూడటం తనకు ఎంతో ఇష్టమని.. ఈ సినిమాలో అలాంటి సీన్లను తెగ ఎంజాయ్ చేశానంటూ’ చెప్పుకొచ్చింది. బయట కూడా గొడవలు జరిగితే ఆగి మరీ చూస్తానని చెప్పుకొచ్చింది. అవంటే ఎందుకో తన మనసు లాగేస్తుందని తన వీక్ నెస్ ను బయటపెట్టింది.

విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల.. బోసుబాబు నిడుమోలు.. ఆనంద్ రెడ్డి.. మనోహర్ రెడ్డి కలిసి ఈ మూవీని నిర్మించారు. రాజ్ విరాట్ దర్శకుడు.  ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.