Anchor Rashmi : జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంకర్ గా బుల్లితెర ఆడియన్స్ ని సుమారుగా 12 ఏళ్ళ నుండి గ్యాప్ లేకుండా అలరిస్తూనే ఉంది రష్మీ(Anchor Rashmi). కేవలం జబర్దస్త్ షో మాత్రమే కాదు, ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ లోనూ రష్మీ యాంకర్ గా కొనసాగుతూ వస్తుంది. యాంకరింగ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా కూడా నటించింది. వాటిల్లో ‘గుంటూరు టాకీస్’ ఒక్కటే కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. మిగిలిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా ఆడియన్స్ కి తెలియదు. కానీ రష్మీ కి ఇప్పటికీ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోస్ తప్ప మరొకటి లేవు. అయితే రష్మీ ఎల్లప్పుడూ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
సమాజం లో జరిగే వివిధ అంశాల పై ఆమె ఎన్నోసార్లు బావోద్వేగంగా స్పందిస్తూ ఉంటుంది. అందుకు ఆమెపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్పుడప్పుడు నెగటివిటీ చూపిస్తూ ఉంటారు కానీ, ఆమె మాత్రం తాను సోషల్ మీడియా ద్వారా మనసులో చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటుంది. అలాంటి రష్మీ ఇప్పుడు సోషల్ మీడియా కి దూరం గా ఒక నెల రోజుల పాటు ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆమె కాసేపటి క్రితమే ఒక పోస్ట్ వేసింది. అందులో ఏముందంటే ‘అందరికీ నమస్కారం..నేను ఒక నెల రోజుల పాటు డిజిటల్ డీటాక్స్ ని పాటించాలని అనుకుంటున్నాను. ఈమధ్య కాలం లో వ్యక్తిగతంగా నేను అనేక సమస్యలు ఎదురుకుంటున్నాను. వృత్తిపరంగా కూడా నా కెరీర్ అనుకున్న స్థాయిలో వెళ్లడం లేదు. మన జీవితం లో సోషల్ మీడియా ఈమధ్య కాలం లో ఒక భాగం అయిపోయింది’.
‘కొన్ని సార్లు అది మన ఆలోచనలను డిస్టర్బ్ చేస్తుంది, చాలా ప్రభావితం కూడా చేస్తూ ఉంటుంది. అందుకే మానసిక ప్రశాంతత కోసం నేను సోషల్ మీడియా కి దూరం గా ఉండాలని అనుకుంటున్నాను. కానీ మీ అందరికి ఒక ప్రామిస్ చేస్తున్నాను. కచ్చితంగా నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఈసారి ఎంతో దృడంగా మీ ముందు నిల్చుంటాను. నేను నా శక్తిని మొత్తం పునరుద్దించుకోవడం కోసమే ఈ నిర్ణయం. ఒక నెల రోజులు సోషల్ మీడియా ప్రభావం లేకుండా ఎలా ఉంటుందో చూద్దాం. నా మాటలను బట్టి నేను చాలా స్ట్రాంగ్ అమ్మాయిని అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నేను కూడా అనేక సందర్భాల్లో కృంగిపోయాను. ఈ నెల రోజుల గ్యాప్ లో కొన్ని విషయాలను పూర్తి స్థాయిలో సరిదిద్దుకొని వస్తాను. మీ సపోర్ట్ నాకు ఎల్లపుడూ ఉంటుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది రష్మీ.