Anchor Jhansi: తొలితరం స్టార్ యాంకర్స్ లో ఝాన్సీ ఒకరు. కేబుల్ టీవీ వచ్చాక పలు ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. యాంకరింగ్ ఆఫర్స్ పెరిగాయి. సుమ, ఉదయభాను, ఝాన్సీ వంటి వారు సత్తా చాటారు. టాక్ ఆఫ్ ది టౌన్ షో ఝాన్సీకి మంచి ఫేమ్ తెచ్చింది. అలాగే పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరించారు. అదే సమయంలో నటిగా మారి సక్సెస్ అయ్యారు. అయితే ఝాన్సీ జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆమె నటుడు జోగి నాయుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కూతురు పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో విడిపోయారు.
అప్పుడప్పుడు వీరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో ఝాన్సీ పరిశ్రమలో తనకు జరిగిన అన్యాయం గురించి ఓపెన్ అయ్యారు. కొందరి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాకు అన్యాయం చేసిన వాళ్లకు నా శాపం తప్పకుండా తగులుతుంది. నా ఉసురు తగిలి పాడైపోయినోళ్లు చాలా మంది ఉన్నారన్నారు.
ఓ పెద్ద హీరో, డైరెక్టర్ రెండు రోజులు నాతో వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ చేయించుకున్నారు. నాకు రావాల్సింది ఇచ్చేశారు. కానీ నన్ను సినిమా నుండి తీసేశారు. ఆ పాత్ర మరొక వ్యక్తితో చేయించుకున్నారు. అది నాకు అవమానమే కదా. వాళ్లకు మామూలు దెబ్బ తగల్లేదు. తిరిగి కోలుకోలేనంత దెబ్బ తగిలింది. నా శాపం వలనే అనను కానీ… ఆ మూవీలో దమ్ము లేదు. అందుకే ఆడలేదు.
నేను ఓ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని, రైడింగ్ లో పట్టుబడ్డానని, పోలీసుల అరెస్ట్ చేశానని వార్తలు రాశారు. రైడింగ్ లో దొరికితే నేను ఇప్పుడు ఇక్కడ ఉండను కదా. అది ఎవరు రాయించారో తెలుసు. ఎందుకు రాయించారో నాకు తెలుసు. దానికి వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. నా గురించి గూగుల్ లో వెతకాలంటే పదో పేజీలోకి వెళ్ళాలి. నేను చేసిన సామాజిక కార్యక్రమాల గురించి తెలియాలంటే పదిహేనో పేజీలోకి వెళ్లాలి. నాకు 8 నంది అవార్డ్స్ వచ్చాయని కొందరికే తెలుసు.
వెబ్ మీడియా జర్నలిజం కట్ అండ్ పేస్ట్. ఒకరిని చూసి అందరూ అదే రాస్తారు. రీసెర్చ్ చేసి, ఫోన్ చేసి అడిగి వాస్తవాలు రాసేవాళ్ళు లేరు. అందుకే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాపై వచ్చిన తప్పుడు రాతల వలన ఒక పదవి కోల్పోయాను. చాలా కాలంగా యూనిసెఫ్ తరపున పని చేస్తున్నాను. నన్ను కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని వారు అనుకున్నారు. నిరాధార కథనాలు కారణంగా వారు నన్ను తప్పుగా అనుకోని నాకు ఆ పదవి ఇవ్వలేదు. దాని వలన పైసా నష్టం లేదు. కానీ బాధ కలిగించింది… అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.