ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పుట్టిన రోజు. ఫిబ్రవరి 17వ తేదీన ఆయన 67వ పడిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో.. కేసీఆర్ బర్త్ డేను ఘనంగా జరుపుకునేందుకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఈ వేడుకలను భారీగా నిర్వహించాలని తెలంగాణ వ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు.
Also Read: రోడ్డుమీద లుంగీలు అమ్ముకునే అలీని.. స్టార్ కమెడియన్ గా మార్చింది ఆయనే!
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా కేసీఆర్ పుట్టినరోజు నాడు కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కోటి మొక్కలను నాటి కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వబోతున్నామని ఆయన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసందే.
ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పలువురు సెలబ్రిటీలు కూడా భాగమవడం విశేషం. ఇందులో భాగంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. అయితే.. తాజాగా ఈ కార్యక్రమంలో యాంకర్ అనసూయ కూడా భాగమయ్యారు. అంతేకాదు.. ఈ మేరకు ఒక వీడియోను కూడా రూపొందించారు అనసూయ. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ పిలుపునిచ్చారు. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Also Read: 50 ఏళ్ల వయసులో పిల్లల్ని కంటున్నారు.. ఆ టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా?
ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. ‘‘ఈ రాష్ట్రం నాకు ఏమి ఇచ్చిందని కాదు.. ఈ రాష్ట్రానికి నేను ఏం ఇచ్చాను అని ఆలోచించాలి. మీరు అలా ఆలోచిస్తున్నారా..? అయితే రండి.. మన భావితరాలకు కాలుష్యం తగ్గించేందుకు మనవంతు ప్రయత్నంగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షోత్సవంలో పాల్గొందాం.’’ అంటూ అనసూయ పిలుపునిచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Anchor anasuya special birthday gift to cm kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com