Anasuya Bharadwaj: పనికిమాలిన వాళ్ళు అదుపు తప్పారు, ఉప్పు కారం తింటున్నారా… అనసూయ సంచలన వీడియో!

Anasuya Bharadwaj: ఫైర్ బ్రాండ్ అనసూయ అసలు తగ్గడం లేదు. ఎవడేమనుకున్నా నేను చెప్పిందే కరెక్ట్. నా అభిప్రాయానికి కట్టుబడి ఉంటానన్నట్లు మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ఆడేసుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఓ సంచలన వీడియో విడుదల చేశారు. వాళ్ళు ట్రోల్ చేయడం వలన నాకు ఏం కాలేదు. మీడియా సంస్థలు మీరే నిజాలు రాయాలి అంటూ ఏకిపారేశారు. అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఏమన్నారో పరిశీలిస్తే… ”సెలబ్రిటీల […]

Written By: Shiva, Updated On : May 10, 2023 6:28 pm

Anasuya Bharadwaj

Follow us on

Anasuya Bharadwaj: ఫైర్ బ్రాండ్ అనసూయ అసలు తగ్గడం లేదు. ఎవడేమనుకున్నా నేను చెప్పిందే కరెక్ట్. నా అభిప్రాయానికి కట్టుబడి ఉంటానన్నట్లు మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ఆడేసుకున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఓ సంచలన వీడియో విడుదల చేశారు. వాళ్ళు ట్రోల్ చేయడం వలన నాకు ఏం కాలేదు. మీడియా సంస్థలు మీరే నిజాలు రాయాలి అంటూ ఏకిపారేశారు. అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఏమన్నారో పరిశీలిస్తే… ”సెలబ్రిటీల మీద వార్తలు రాసి పొట్ట నింపుకునే వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.

ఫలానా హీరో ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేశారు, వేధించారు ఇది కాదు మీరు రాయాల్సింది. మీకు ఇంకా ఈ ప్రపంచం ఏమిటో తెలియడం లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. వాగిన వాడి నోరే కంపు కొడుతుంది. మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటే నిజాలు రాయండి. నేను నిజం మాట్లాడాను. నా మాటలకు కట్టుబడ్డాను. పనికిమాలిన వాళ్ళు అదుపు తప్పారు. ఇది మీరు పెట్టాల్సిన థంబ్ నెయిల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం” అని అనసూయ అన్నారు.

ఈ వీడియోలో అనసూయ మీడియా సంస్థలను, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఏకిపారేశారు. ఆమె గుట్టుగా ఉంటే వివాదం సద్దుమణుగుతుంది అనుకుంటే… అనసూయ అసలు తగ్గడం లేదు. కాగా అనసూయ ట్వీట్ తో తాజా వివాదం రగులుకుంది. ఖుషి చిత్ర పోస్టర్స్ లో విజయ్ దేవరకొండ పేరుకు ‘The’ అని వాడారు. దాన్ని అనసూయ తప్పుబట్టారు. ‘ఏంటి The నా? పైత్యం పరాకాష్టకు చేరిందని ట్వీట్ చేశారు. అక్కడ విజయ్ దేవరకొండ పేరు మెన్షన్ చేయకున్నప్పటికీ ఆమె ఉద్దేశం అదే అని ఫ్యాన్స్ భావించారు. ఆంటీ అంటూ ట్రోల్స్ షురూ చేశారు.

గత నాలుగైదు రోజులుగా ఈ వివాదం నడుస్తోంది. గతంలో కూడా అనసూయ విజయ్ దేవరకొండను గెలికారు. లైగర్ ప్లాప్ టాక్ తెచ్చుకోగా… సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు. అప్పుడు కూడా అనసూయతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సోషల్ మీడియా వార్ నడిచింది. చెప్పాలంటే అనసూయ సంబంధం లేని వివాదాలతో కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారు. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న జర్నీని దుర్భరంగా మార్చుకుంటున్నారు. మంచో చెడో పరిశ్రమలో అనసూయ లాంటి యాటిట్యూడ్ వర్క్ అవుట్ కాదు.