Anchor Anasuya Emotional Post: యాంకర్ అనసూయ(Anchor Anasuya) సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు. అప్పుడప్పుడు ఈమె సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ పై ఈమె సోషల్ మీడియా లో బహిరంగంగా ఎన్నోసార్లు మండిపడింది. వీళ్ళ మధ్య గొడవ ఎక్కడ నుండి మొదలైందో తెలియదు కానీ, అనసూయ మాత్రం విజయ్ దేవరకొండపై పాము లాగా పగబట్టేసింది. కేవలం ఇదొక్క విషయం లోనే కాదు, నెటిజెన్స్ ఎవరైనా తనపై అసభ్య కామెంట్స్ చేసినప్పుడు పోలీస్ కేసులు వేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె దీపావళి పండుగ రోజున ఫేస్ బుక్ తన పాత జ్ఞాపకాలను తల్చుకుంటూ పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ బాగా వైరల్ అయ్యింది.
ఆమె మాట్లాడుతూ ‘నా చిన్నతనం లో జరుపుకున్న పండుగలు, వాటి అనుభవాలను జీవితం లో మర్చిపోలేను. ముఖ్యంగా దీపావళి పండుగ కోసం ఏడాది మొత్తం ఎదురు చూసేదానిని. తెల్లవారుజామున నిద్ర లేవగానే మంగళారతి ఇచ్చి తండ్రి ఆశీస్సులు తీసుకున్న ఆ మధురమైన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆరోజున ఇంట్లో అమ్మ చేసిన స్వీట్లు,సావరీల సువాసనలు ఇప్పటికీ గుర్తున్నాయి. పూజ సమయం లో మా అమ్మ నా చేత పలికించిన గాయత్రీ, లక్ష్మి దేవి శ్లోకాలు , ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకొని ఇంటి చుట్టూ దీపాలు వెలిగించేవాళ్ళం. నాకు పెద్ద పెద్ద టపాకాయలు కాల్చాలనే కోరిక ఉండేది కాదు, చిన్న చిన్న చుచ్చుబుడ్డీలు కాల్చినా సంతోషించేదాన్ని. అప్పటి రోజులను ఇప్పుడు బాగా మిస్ అవుతున్నాను. మాకు ఉన్న బిజీ లైఫ్ కారణంగా పిల్లలతో పూర్తి సమయం కేటాయించలేకపోవచ్చు కానీ, ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మాత్రం, నేను చిన్నతనం లో ఎలాంటి అనుభూతిని పొందానో, వాటిని నా పిల్లలకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తమ కుటుంబం లో కూడా అలాంటి వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రతీ మహిళకు నా సెల్యూట్’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది అనసూయ.
ఆమె మాట్లాడిన ఈ మాటలను చూస్తే మన చిన్నతనం లో దీపావళి జరుపుకున్న రోజులు గుర్తు వచ్చాయి. కుల మతాలకు అతీతంగా అందరూ ఈ పండుగ అని ఎందుకు అంత ఘనంగా జరుపుకుంటారో ఆమె మాటల్లోని సంతోషాన్ని చూస్తే తెలుస్తోంది. అనసూయ ఇలాంటి పోస్టులు అప్పుడప్పుడు చాలా బాగా పెడుతూ ఉంటుంది. తమకు నీ బాల్యం గురించి మాత్రమే కాకుండా, తమ బాల్యం కూడా గుర్తు చేసుకునేలా చేసినందుకు అనసూయ కి ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ క్రింద నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.