
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ (Anasuya) అంటే తెలియని వారు ఉండరు. తన అందం చందంతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ చలాకీ పిల్ల సినిమాల్లోనూ మంచి పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. రెండు రంగాల్లోనూ నటిస్తోంది.
ఇప్పటికే రాంచరణ్ తో రంగమ్మత్తగా నటించి మెప్పించిన అనసూయ ప్రస్తుతం బన్నీతో ‘పుష్ప’లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో మెగా హీరో సినిమాలోనూ అనసూయ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఆమె చాన్స్ వచ్చిందని చెబుతున్నారు.
తాజాగా ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మెగా స్టార్ చిరంజీవితో కూడా అనసూయ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ రీసెంట్ గా మోహన్ రాజా దర్శకత్వంలో లుసిఫర్ రిమేక్ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ కమర్షియల్ పొలిటికల్ సినిమాలో అనసూయ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టు చెబుతున్నారు.
చిరంజీవి సినిమాలో చాలా ముఖ్యమైన ఒక పాత్ర కోసం అనసూయను చిత్రం యూనిట్ ఎంపిక చేసినట్టు సమాచారం. అనసూయ పాత్ర సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా అంటున్నారు. ఇటీవలే ఆమె నుంచి కాల్షీట్లు కూడా తీసుకున్నట్లు సమాచారం.
వరుసగా మెగా హీరోల సినిమాల్లో నటిస్తున్న అనసూయకు అదే ఫ్యామిలీ హీరోల నుంచి వరుస అవకాశాలు రావడం విశేషమనే చెప్పాలి.