Anasuya Bharadwaj: సోషల్ మీడియా లో ఫైర్ బ్రాండ్ గా, నిత్యం వార్తల్లో ఉండే సెలబ్రిటీ అనసూయ(Anasuya Bharadwaj). సమాజం లో జరిగే వివిధ అంశాలపై యాంకర్ అనసూయ అప్పుడప్పుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. కానీ ఎందుకో ఈమె అభిప్రాయాలను సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్ అత్యధిక శాతం మంది అంగీకరించరు. ఫలితంగా తీవ్రమైన ట్రోల్స్ కి గురి అవుతూ ఉంటుంది యాంకర్ అనసూయ. రేసెంటీ గానే ప్రముఖ నటుడు శివాజీ హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి కామెంట్స్ చేయడం, దానికి అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పడం వంటివి మనమంతా చూసాము. ఆ విషయం లో శివాజీ కి నెటిజెన్స్ నుండి సంపూర్ణమైన మద్దతు లభించగా, అనసూయ కి మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఆమెని ట్రోల్ చెయ్యని వాళ్లంటూ ఎవ్వరు మిగలలేదు అనడం లో అతిశయోక్తి కాదేమో.
అయితే అనసూయ కి తనపై ట్రోల్స్ వేసే వాళ్లపై పోలీస్ కేసులు వేయడం బాగా అలవాటు. ఎన్నోసార్లు ఇది జరిగింది. రీసెంట్ గా తనపై సోషల్ మీడియా లో వచినటువంటి ఈ ట్రోల్స్ కి బాగా హర్ట్ అయిన అనసూయ నేడు ఏకంగా 73 మందిపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ శేఖర్ బాషా, బొజ్జా సంధ్యా రెడ్డి, ప్రియా చౌదరి గోగినేని, పావని, రజిని వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. బొజ్జ సంధ్యా రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన లీడర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. అధికార పార్టీ కి సంబంధించిన వ్యక్తులపై పోలీస్ కేసు నమోదు చేయడమంటే సాధారణమైన విషయం కాదు. ఈ విషయం లో అనసూయ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మరోపక్క అనసూయ ఇలా పోలీస్ కేసులు నమోదు చేయడం పై ప్రముఖ సింగర్ చిన్మయి సమర్ధించింది.
ఆమెనే అనసూయ ఇలా పోలీస్ కేసులు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చింది. యానకర్ అనసూయ ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత బొజ్జ సంధ్యా రెడ్డి చేసిన కామెంట్స్ ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చిన్మయి ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ కి మహిళల రక్షణ పట్ల అంకిత భావం ఉన్నట్లయితే సంధ్యా రెడ్డి ని వెంటనే ఆ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేసింది. సింగర్ చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అధికార పార్టీ ని రాజకీయాలకు సంబంధం లేని ఈ ఇద్దరు ఎదురుకోవడం నిజంగా సాహసం అనే చెప్పాలి. మరి సంధ్యా రెడ్డి నుండి ఎలాంటి రియాక్షన్ రాబోతుందో చూడాలి.