Anchor Anasuya Bharadwaj: అనసూయ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ట్రోలర్లు ఆమె పై విరుచుకుపడుతున్నారు. నోటికొచ్చినట్టుగా కామెంట్లు పెడుతూ టార్చర్ చూపిస్తున్నారు. అనసూయను పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ విసిగిస్తున్నారు. ప్రధానంగా ఈ వ్యవహరం అంతా ఆంటీ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. కానీ, తనను ఆంటీ అని పిలవడాన్ని అనసూయ అస్సలు సహించలేకపోతోంది. మొత్తానికి ఈ ఆంటీ పైనే పెద్ద రాధ్దాంతం జరుగుతోంది. ట్విట్టర్‌లో అనసూయ పెద్ద యుద్దమే చేస్తోంది. దాంతో ఆంటీ అనే పదం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అయితే కొంత మంది నెటిజన్లు మాత్రం అనసూయను తీవ్రంగా దూషిస్తున్నారు. గీత దాటేస్తూ దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలో అనసూయ ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసి అందర్నీ షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో తనను ‘Aunty’ అని సంభోదిస్తూ.. కామెంట్స్ చేసిన వారి పై మొత్తానికి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ట్వీట్ చేసింది. ‘యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్. దీని ప్రక్రియ మొదలవుతుంది. మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే పెద్దది’ అని పోస్ట్ పెట్టింది.
మొత్తమ్మీద ఈ మధ్య అనసూయ గురించే ఎక్కువ హడావుడి జరుగుతుంది. ఇక సినిమాలతో పాటు ఇటు ఓటీటీలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో అనసూయ అవకాశాలు అందుకుంటోంది. పైగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటించి అలరిస్తోంది. అలాగే అటు మోడ్రన్ లుక్ అయినా, ఇటు ట్రెడిషనల్ లుక్ అయినా అనసూయ మాత్రం ఒకేలా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది.

బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది. మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా బుల్లితెరపై బిజీగా ఉంటూనే.. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో హడావుడి చేస్తోంది. మధ్యలో పై విధంగా సోషల్ మీడియాలో రచ్చకు దిగుతుంది.
https://www.youtube.com/watch?v=5THwJgxJGv0