Anasuya Bhardwaj : అనసూయ భరద్వాజ్ కి ఓ ఇమేజ్ ఉంది. అందానికి మించి ఆమెలో కొన్ని సపరేట్ క్వాలిటీస్ ఉన్నాయి. అనసూయ చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. మై లైఫ్ మై రూల్స్ అనే యాటిట్యూడ్ ఆమెది. ఒకరి కోసం మనం ఎప్పుడూ బ్రతక కూడదు. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తే… ఏదీ చేయలేం అంటుంది. అనసూయ తీరు కొందరికి నచ్చదు. అందుకే అనసూయ తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. అయితే అనసూయ ఎదుగుదల వెనుక చాలా కృషి ఉందని సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చాడు.
గతంలో ఆయన పలు షోలకు రచయితగా దర్శకుడిగా పని చేశాడు. తాజాగా బెజవాడ ప్రసన్న కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూయతో పని చేసిన అనుభవం పంచుకున్నాడు. అనసూయను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఏం చేసిన తప్పుబడుతుంటాడు. నిజానికి అనసూయ చాలా హార్డ్ వర్కర్. ఆమె ఎదుగుదల వెనుక చాలా కష్టం ఉందని చెప్పుకొచ్చాడు.
గతంలో అలీ టాకీస్ పేరుతో ఒక షో చేశాము. షూట్ అయ్యాక అనసూయ 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు రిహార్సల్స్ చేసింది. పని పట్ల ఆమెకు అంతటి నిబద్ధత ఉండేది. నేను ఓ ఛానల్ కి షో చేయాల్సి ఉంది. యాంకర్ గా అనసూయను అనుకున్నాము. టెస్ట్ షూట్ కి డేట్ ఫిక్స్ చేశాము. షూట్ కి రెండు రోజుల ముందే ఆమెకు డెలివరీ అయ్యింది. ఒక రోజు రెస్ట్ తీసుకుంది. రెండో రోజు జిమ్ కి వెళ్ళింది. ఆ నెక్స్ట్ డే షూట్ లో పాల్గొంది. అనసూయ గ్లామర్ ఇమేజ్ వెనుక చాలా కష్టం ఉందని… బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చాడు.
అనసూయ జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చింది. 2013లో ఈటీవిలో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ మొదలైంది. అనసూయ యాంకర్ గా ఎంపికైంది. షో మొదలైన కొన్నాళ్ళకు అనసూయ తప్పుకుంది. ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ వచ్చింది. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరో షో స్టార్ట్ చేశారు. దాంతో అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటిగా కొనసాగుతుంది.