Anasuya Sister: స్టార్ యాంకర్ అనసూయ చెల్లి బుల్లితెర ఆరంగేట్రానికి సర్వం సిద్ధమని సమాచారం అందుతుంది. జీ తెలుగులో స్టార్ట్ కానున్న ఓ షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించనున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అనసూయకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్లలో వైష్ణవి ఒకరు. అందంలో చలాకీతనంలో అక్కను పోలి ఉండే వైష్ణవి యాంకర్ గా ఎంట్రీ ఇస్తే బుల్లితెరను ఏలేయడం ఖాయమన్న వాదన ఎప్పటి నుండో ఉంది. అప్పుడప్పుడు అక్కతో పాటు వైష్ణవి బుల్లితెరపై కనిపించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు.

యాంకర్ గా నటిగా అనసూయ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. పరిశ్రమలో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకొని భారీ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫీల్డ్ లో సక్సెస్ అయితే ఏ రేంజ్ కి వెళ్ళొచ్చో నిరూపించింది. అక్క స్పూర్తితో వైష్ణవి కూడా యాంకర్ గా మారాలని డిసైడ్ అయ్యాడట. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. జీ తెలుగులో ప్రసారం కానున్న కొత్త షోకి యాంకర్ గా వైష్ణవి ఎంట్రీ ఇవ్వనున్నారట.
అనసూయ చెల్లి అనే ఇమేజ్ కూడా షోకి ప్లస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ దాదాపు ఖాయమే అంటున్నారు. అదే సమయంలో వైష్ణవి ఎంట్రీ తో అనసూయకు దేత్తదే అంటున్నారు. ఈ యంగ్ లేడీ అక్కను దాటిపోవడం ఖాయం అంటున్నారు. కాగా అనసూయ కెరీర్ హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ గా మొదలైంది. తర్వాత న్యూస్ ప్రెజెంటర్ గా మారారు. జబర్దస్త్ షోతో ఆమె ఫేట్ మారిపోయింది.

జబర్దస్త్ అనసూయను స్టార్ చేసింది. ఆ షోతో వచ్చిన ఇమేజ్ తో అనసూయ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏకంగా హీరోయిన్ గా సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. ఒక ప్రక్క యాంకరింగ్ చేస్తూనే అనసూయ… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. అనసూయ చెల్లి వైష్ణవి ఎంట్రీ ఇచ్చిన క్రమంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.