Anasuya : ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిగా బిజీ అయ్యింది. ఆమెకు లీడ్ రోల్స్ సైతం దక్కాయి. విలక్షణ పాత్రలు చేస్తూ పరిశ్రమలో నిలదొక్కుకుంది. ఇతర భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. అనసూయ రోజుకు రెండు నుండి మూడు లక్షలు ఛార్జ్ చేస్తుందట. దాంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పింది. జబర్దస్త్ తో పాటు మిగతా బుల్లితెర షోల నుండి ఆమె తప్పుకుంది. ఇకపై టెలివిజన్ షోలు చేసేది లేదని వెల్లడించింది. టీఆర్పీ స్టంట్స్ నచ్చకపోవడంతో పాటు కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడటం వలనే షోలు మానేస్తున్నానని అనసూయ ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు.
అయితే ఓ రెండేళ్లు గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. స్టార్ మా లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో ఓ సెలబ్రిటీ షో గత ఏడాది మొదలైంది. బుల్లితెర సెలెబ్స్ కంటెస్ట్ చేసే ఈ షోకి శేఖర్ మాస్టర్, అనసూయ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 1లో అనసూయ ఎక్స్ ఫోజింగ్ చేసి మరోసారి చర్చకు తెరలేపింది. ఏకంగా శేఖర్ మాస్టర్ కి పోటీగా తన ఒంటిపై దుస్తులు తొలగించింది. ఆమె చర్య షోకి విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది.
Also Read : శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!
సీజన్ 1 సక్సెస్ కావడంతో ఇటీవల సీజన్ 2 మొదలైంది. లేటెస్ట్ సీజన్ లో అనసూయ ఒకింత గ్లామర్ షో తగ్గించింది. ఆమె నిండైన దుస్తుల్లో కనిపిస్తుంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కోసం చీర ధరించింది. బ్యాక్ లెస్ బ్లౌజ్ లో మాత్రం హీటెక్కించే ప్రయత్నం చేసింది. కాగా శేఖర్ మాస్టర్ తో కలిసి కొన్ని ఫోజులిచ్చింది అనసూయ. అతని భుజం పై వాలి రొమాన్స్ కురిపించింది. ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. పెళ్ళైన అనసూయ పరాయి మగాడితో ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేయడం ఏమిటంటూ నెటిజన్స్ ఎద్దేవా చేస్తున్నారు. విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు శేఖర్ మాస్టర్ ఈ మధ్య వివాదాల్లో ఉంటున్నారు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ అశ్లీలంగా ఉంటున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తుంది. మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ చిత్రాల్లో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయి.
Also Read : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ..