https://oktelugu.com/

Anasuya : అనసూయ హాట్ జిమ్ వర్కవుట్ వీడియోపై నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్

నాన్న చనిపోయాక ఆహారపు అలవాట్లు, నిద్ర గాడితప్పాయని.. ఆరోగ్యమే మహాభాగ్యం అని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడని.. మహిళలందరినీ ఈ వీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 25, 2023 / 11:40 AM IST
    Follow us on

    Anasuya : అనసూయ ఏం చేసినా అది వార్తల్లో నిలుస్తుంది. ఆమె అందంతో మాయచేసినా.. లేక ఎవరిపైన అయినా ఆరోపణలు చేసినా వార్తగానే కనపడుతుంది. జబర్ధస్త్ మానేశాక అనసూయలో కాసింత గడుసు తనం.. కోపం తాపం వచ్చిందని అనే వారు ఎందరో.. అయినా కూడా అనసూయ తనకు నచ్చినట్టే బతుకుతోంది.

    ఈ మధ్యన భర్త బర్త్ డే సందర్భంగా పెట్టిన ముద్దులు, హగ్గులు, బికినీలు దుమారం రేపినా ఎక్కడా తగ్గకుండా అనసూయ ముందుకెళ్లింది. తన విషయాల్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకపోవడం ఈ బ్యూటీ ప్రత్యేకత.. తాజాగా ఈమె జిమ్ లో హాట్ గా చేసిన కసరత్తు ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా.. తిట్టినా.. ట్రోల్స్ చేసినా వారందరికీ క్లాస్ పీకే అనసూయ.. సోషల్ మీడియాలో తగ్గకుండా ట్రోల్స్ చేస్తూనే ఉంది.

    తాజాగా దసరా పండుగ సందర్భంగా తన జిమ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేస్తూ మళ్లీ సీరియస్ అయ్యింది అనసూయ.. జిమ్ లో భారీ వర్కవుట్ చేస్తూ చెమటలు కక్కేస్తున్న అనసూయ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోతోపాటు ట్రోల్స్ కు షాకిస్తూ మహిళలను ప్రోత్సహించేలా ఓ సుధీర్ఘమైన నోట్ రాసింది. సాధారణ మహిళ కాళీగా ఎలా మారుతుందో చెప్పుకొచ్చింది. సోమరితనాన్ని జయించండి అంటూ పేర్కొంది.

    నాన్న చనిపోయాక ఆహారపు అలవాట్లు, నిద్ర గాడితప్పాయని.. ఆరోగ్యమే మహాభాగ్యం అని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడని.. మహిళలందరినీ ఈ వీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.