Anasuya vs Vijay Devarakonda : అనసూయ-విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పదే పదే విజయ్ దేవరకొండను అనసూయ టార్గెట్ చేస్తుండగా వారు మండిపడుతున్నారు. కారణం తెలియదు కానీ… అనసూయకు విజయ్ దేవరకొండ అంటే నచ్చదు. విజయ్ దేవరకొండతో అనసూయ భర్తకు గొడవైందని, అందుకే అనసూయ ఇలా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారనే వాదన ఉంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. హీరో విజయ్ దేవరకొండతో అనసూయ వివాదం ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి మూవీ నుండి కొనసాగుతుంది.
ఆ సినిమాలో విజయ్ దేవరకొండ డైలాగ్స్ లోని కొన్ని బూతులను ఆమె తప్పుబట్టారు. లవర్ ని హీరో కొట్టడం, లిప్ లాక్ సన్నివేశాల మీద అభ్యంతరం తెలిపారు. ఆ వివాదాన్ని లైగర్ మూవీ విడుదల సమయంలో అనసూయ తెరపైకి తెచ్చింది. పరోక్షంగా లైగర్ చిత్ర ఫెయిల్యూర్ ని ఆమె ఎంజాయ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అది వివాదానికి దారి తీసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. ఓ వారం రోజుల పాటు అనసూయతో విజయ్ దేవకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్ కి దిగారు.
తాజాగా అనసూయ మరోసారి విజయ్ దేవరకొండను గెలికారు. ఖుషి చిత్ర ప్రమోషనల్ పోస్టర్స్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘ది’ అని వాడటాన్ని ఆమె తప్పుబట్టారు. ఇండైరెక్ట్ గా ఆయన మీద సెటైర్ వేశారు. దాంతో మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రోలర్స్ కామెంట్స్ కి అనసూయ తిరిగి కౌంటర్లు ఇస్తూ వాళ్ళను మరింత రెచ్చగొడుతుంది.
నన్ను ఒక్కదాన్ని ఎదుర్కొనేందుకు వందల కొద్దీ ఫ్యాన్స్ ఎగేసుకుంటూ వస్తున్నారని ఆమె ఎద్దేవా చేస్తున్నారు. ఆ అర్థం వచ్చేలా అతడు మూవీలోని ఓ సన్నివేశాను ఆమె రీట్వీట్ చేశారు. అతడు మూవీలో బ్రహ్మాజీ మహేష్ బాబును కొట్టించేందుకు జాతరకు రౌడీలను తెస్తాడు. వాళ్ళను చూసి మహేష్… ఒక్కడ్ని కొట్టడానికి ఇంత మందా! అని డైలాగ్ చెబుతాడు. ఆ వీడియో అనసూయ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతుంది. చూస్తుంటే అనసూయ అసలు తగ్గేలా లేదు.
Exactly this one 🤭🤭 https://t.co/hoRGJqjOMM
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 8, 2023