Anasuya Bharadwaj : అనసూయ యూఎస్ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా న్యూ జెర్సీలోని గో కార్టింగ్ ని సందర్శించారట. ఆది ప్రపంచంలోనే పెద్దది. నాకు బాగా నచ్చింది. ఫుల్ గా ఎంజాయ్ చేశానంటూ అనసూయ వీడియో పోస్ట్ చేశారు. గో కార్టింగ్ అంటే గేమింగ్ జోన్ అని చెప్పొచ్చు. న్యూ జెర్సీలో ఉన్న గో కార్టింగ్ వరల్డ్ లార్జెస్ట్ అని సమాచారం. ప్రస్తుతం న్యూ జెర్సీలో ఉన్న అనసూయ పనిలో పనిగా గో కార్టింగ్ కి వెళ్ళింది. భవిష్యత్తులో పిల్లలతో పాటు ఇక్కడకు రావాలని కామెంట్ చేశారు. అనసూయ వీడియో వైరల్ అవుతుంది.
ప్రొఫెషన్ లో భాగంగా దేశ విదేశాలు తిరుగుతున్న అనసూయ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. షూటింగ్స్, ఈవెంట్స్, మీటింగ్, ప్రమోషన్స్ తో అనసూయకు తీరిక లేకుండా పోతుంది. అదే సమయంలో చేతినిండా సంపాదిస్తుంది. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఫేడ్ అవుట్ అయ్యాక పట్టించుకునే నాథుడే ఉండడు. అందుకే అనసూయ కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.
అనసూయ పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టింది. ఈ ఏడాది రంగమార్తాండ, విమానం చిత్రాల్లో నటించింది. రంగమార్తాండలో మోడ్రెన్ కోడలు పాత్ర చేసింది. విమానంలో అందుకు పూర్తి భిన్నంగా మాస్ వేశ్య రోల్ చేసింది. ఇలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటుంది. వేశ్య పాత్ర చేయడానికి ఎవరైనా సంశయిస్తారు. అనసూయ ఎలాంటి మొహమాటం లేకుండా పాత్రకు ఓకే చెప్పింది. ఆమె గట్స్ కి ఇదొక నిదర్శనం.
ప్రస్తుతం పుష్ప 2 చిత్రం చేస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పుష్ప 2లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పెద కాపు టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో మరోసారి మాస్ గెటప్ లో అలరించనుంది. ఈ చిత్రంలో అనసూయ పాత్ర రణస్థలంలోని రంగమ్మత్త పాత్రను తలపిస్తుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.