https://oktelugu.com/

Anasuya Bhardwaj: షాకింగ్ వీడియో: తన బాధ మొత్తం వెళ్లగక్కుతూ గుండెలు పగిలేలా ఏడ్చిన అనసూయ..!

బుల్లితెరకు పూర్తిగా స్వస్తి చెప్పి వెండితెర కు పరిమితమైన అనసూయ కు మంచి అవకాశాలే వస్తున్నాయి. అద్భుతమైన రోల్స్ చేస్తూ సినీ కెరీర్ లో దూసుకెళ్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : August 19, 2023 / 05:01 PM IST

    Anasuya Bhardwaj

    Follow us on

    Anasuya Bhardwaj: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయటంలో ముందు ఉండే అనసూయ లేటెస్ట్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనసూయవెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో షేర్ చేసింది. సదరు వీడియోకి సుదీర్ఘ విశ్లేషణ ఇచ్చింది. దీంతో అసలేం జరిగింది అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఫ్యాన్స్, హేటర్స్ కామెంట్స్ వెల్లువెత్తాయి.

    బుల్లితెరకు పూర్తిగా స్వస్తి చెప్పి వెండితెర కు పరిమితమైన అనసూయ కు మంచి అవకాశాలే వస్తున్నాయి. అద్భుతమైన రోల్స్ చేస్తూ సినీ కెరీర్ లో దూసుకెళ్తుంది. ఇలాంటి సమయంలో తాజాగా ఏడుస్తున్న వీడియో అప్లోడ్ చేసి, నా జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి, వాటిని ఫేస్ చేశాను,నా లైఫ్ లో కూడా కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని పోస్ట్ పెట్టింది. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప వారికైనా కానీ కష్టాలు, కన్నీళ్లు సహజమే అంటూ అనసూయ ఆవేదన చెందింది.

    మన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు బాధను వ్యక్తం చేయటం కోసం గట్టిగా ఏడవడం లో తప్పేమి లేదు. అలా ఏడ్చి బాధను బయటకు పంపించి మళ్ళీ స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ కావాలి. బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అధైర్య పడకుండా నిలబడాలి. నా పోస్ట్ చూసిన వెంటనే అందరూ కన్ఫ్యూజ్ అవుతారని తెలుసు. ఫోటో షూట్లు, పోజులు, క్యాండీడ్స్, చిరునవ్వులు, డాన్సులు, బలమైన కౌంటర్లు, కమ్ బ్యాక్స్ అన్నీ నా జీవితంలో భాగమే అన్నట్లు అందరికి తెలియాలి.

    ఒకరితో ఒకరు రిలేషన్‌ పెంచుకోవాలని, ఈ ప్రపంచాన్ని అందమైన ప్రదేశంగా మార్చాలని, ఒకరికొకరు అండగా నిలవాలని, మంచి చెడు పంచుకోవాలని, జీవనశైలి, సంస్కృతులను అనుభూతి చెందాలని అందరికి చెప్పాలనేదే నా ఉద్దేశ్యం అని చెప్పింది అనసూయ. ఇక అనసూయ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సానుభూతి ప్రకటిస్తుంటే కొందరు ఎగతాళి కామెంట్స్ పెడుతున్నారు. కొందరేమో ఆమె పర్సనల్ లైఫ్ లో ఏదో ఇష్యూ జరిగిందని అందుకే ఇలాంటి పోస్టులు పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ చలాకీగా ఉండే అనసూయ ఏడవడం ప్రాధాన్యత సంతరించుకుంది.