Anasuya Bharadwaj : అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. రెండు చేతులా సంపాదిస్తుంది. అటు నటిగా ఇటు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ లక్షలు అవలీలగా ఆర్జిస్తుంది. ఒక దశ దాటాక డబ్బు వద్దంటే వచ్చిపడుతుంది. అదే దశలో అనసూయ ఉంది. ఓ తరహా పాత్రలకు అనసూయ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆమెకు సినిమాల్లో లెక్కకు మించిన ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. లేత మెరూన్ రంగు చీరలో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది.
ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఫారెన్ టూర్లలో అల్ట్రామోడ్రన్ డెస్సులు వేసింది అనసూయ. హాట్ హాట్ గా కనిపించింది. ఎప్పుడూ అతి చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ చేయడం అనసూయకు అలవాటుగా మారింది.
ఇటీవల బాగా ఏడుస్తున్న ఓ వీడియో షేర్ చేసింది. జనాలు ఏదో జరిగిపోయిందని అనుకున్నారు. తనలోని బాధ బయటకు పోవాలంటే ఇలా మనస్ఫూర్తిగా ఏడుస్తానని కామెంట్ పెట్టింది. తన ఏడుపు వీడియోని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను ఏడవడటం ఏమిటని మరో వీడియో విడుదల చేసింది. ఇది ఒకింత విమర్శలకు దారి తీసింది. ఇక మొన్నటి వరకు విజయ్ దేవరకొండతో గొడవలు. కావాలని విజయ్ ఫ్యాన్స్ ని ఆమె రెచ్చగొట్టేవారు. వారు ట్రోల్ చేస్తే అదో రచ్చ.
చక్కగా కెరీర్ సాగిపోతుంటే ఈ అనవసర వివాదాలు, రాద్ధాంతం అవసరమా అని కొందరు అంటుంటారు. అనసూయ మాత్రం తన నైజం కొనసాగిస్తోంది. జబర్దస్త్ ఆమెకు లైఫ్ ఇవ్వగా… మానేశాక ఆ షోపైనే విమర్శలు చేసింది. తాజాగా సోషల్ మీడియాలో తన అందాలన్నీ ఆరబోస్తూ హీట్ పెంచుతోంది. చీరలో అనసూయ సొగసైన ఫొటోలు సెగలు రేపుతున్నాయి. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.