Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ కుర్రాళ్ళ కలల రాణి. యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు నటిగా సెటిల్ అయ్యారు. జబర్దస్త్ వేదిక అనసూయ సంచలనాలు చేశారు. యాంకరింగ్ లో ట్రెండ్ సెట్ చేశారు. తెలుగు లేడీ యాంకర్స్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత అనసూయదే. పొట్టిబట్టల్లో అందరి టాప్ లేపింది.
అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తగ్గింది లేదు. పైగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చేది. నా బట్టలు నా ఇష్టం. నాకు నచ్చితే ఎలాంటి బట్టలైనా వేసుకుంటా అని ఆత్మవిశ్వాసం ప్రకటించేది. ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకుల హృదయాలు దోచింది. గత ఏడాది అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది.
ఇక యాంకరింగ్ చేసేది లేదంటుంది. నటిగా, యాంకర్ గా రెండు రోల్స్ లో చూసి నా ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ఇకపై యాంకరింగ్ చేయనని అనసూయ వెల్లడించారు. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో యాంకరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
2023లో అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అనసూయ పాత్రకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ప్రతి సినిమాలో ఒక విలక్షణమైన పాత్ర చేసింది.
నెక్స్ట్ అనసూయ పుష్ప 2లో లేడీ విలన్ గా అలరించనుంది. దాక్షాయణిగా డీగ్లామర్ లుక్ లో మెస్మరైజ్ చేయనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళుతుంది….