Anasuya Bharadwaj : వద్దన్నా వివాదాలు అనసూయను చుట్టుముడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఈవెంట్లో పాల్గొన్న అనసూయ అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ఒకింత ఆశ్చర్యం గొలిపే కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ని గంగోత్రి మూవీలో చూసి షాక్ అయ్యాక. అసలు మనోళ్లకు ఏమైంది? ఇలా ఉన్నాడేంటి? అనుకున్నాను. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతాడా అనుకున్నాను. ఇక లంగా ఓణీ కట్టి ఆ పాటలో అయితే దారుణం, చూడలేకపోయాను, అన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కామెంట్స్ అనసూయ గతంలో చేసినవి. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ బయటకు తీసి ఎద్దేవా చేస్తున్నారు. అనసూయ నీ గురించి ఏమన్నారో విను, నువ్వు హీరోనే కాదు అన్నట్లు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అప్పుడు అనసూయ అల్లు అర్జున్ ని పొగిడారు. మొదట్లో అలాంటి ఇంప్రెషన్ కలిగింది. కానీ ఆయన టాలెంట్ చూశాక అభిప్రాయం మారిందని చెప్పుకొచ్చారు.
అనసూయ నెగిటివ్ కామెంట్స్ చేసినంత వరకు కట్ చేసిన వీడియో అల్లు అర్జున్ హేటర్స్ వీడియో వైరల్ చేస్తున్నారు. అనసూయ అనవసరం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతుంది. అనసూయ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది. మొన్నటి వరకు విజయ్ దేవరకొండతో ఆమెకు వివాదం నడిచింది. తప్పు ఎవరిదైనా విజయ్ దేవరకొండ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఇకపై ఆయన మీద ఎలాంటి ట్వీట్స్ వేయనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
కాగా ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ మూవీలో నటిస్తున్నారు. పుష్ప 2 చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం. కెరీర్ పరంగా సక్సెస్ఫుల్ ట్రాక్ లో సాగుతున్న అనసూయను వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది అనసూయ రంగమార్తాండ, విమానం చిత్రాల్లో నటించారు.
Anasuya about #AlluArjun athh anna
Mega family ayithey hero ayipothada
nka nuv bathiki waste ra @alluarjunNuv enti Anasuya mem eppadiki anni hero laga chudam saraina fanbase undadhu flop ayithey mega mg cheyadaniki ready untadu vadu hero enti
i pic.twitter.com/OTDwggTRHK— SPIRIT 😈 (@REBELUNIVERSAI) July 12, 2023