Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ అనసూయ అసలు తగ్గడం లేదు. తనలోని గ్లామర్ పవర్ డిఫరెంట్ యాంగిల్స్ లో పరిచయం చేస్తుంది. తాజాగా టాప్ యాంగిల్ నుండి తల నుండి పాదం వరకు కవర్ అయ్యేలా సెక్సీ సెల్ఫీ దిగారు. షార్ట్ వేసి విదేశీ వీధుల్లో తిరుగుతూ బోల్డ్ నెస్ కి తెరలేపింది. టెక్సాస్ నగరంలో అనసూయ అదిరిపోయే లుక్ లో మెస్మరైజ్ చేసింది. అనసూయ తన విదేశీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా నెటిజన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.

అనసూయ కురచ దుస్తులపై ఎప్పటి నుండో విమర్శలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కలిసి చూసే బుల్లితెర ఈవెంట్స్ లో ఈ రేంజ్ స్కిన్ షో అవసరమా అంటూ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఆ విమర్శలేవీ అనసూయకు పట్టవు. ఎవరేమనుకుంటే నాకేంటి అంటుంది. నా బట్టలు నా ఇష్టం. నాకు సౌకర్యంగా ఉన్నాయా లేవా అన్నదే ముఖ్యం అంటుంది.
బుల్లితెర మీదే రెచ్చిపోయే అనసూయ సోషల్ మీడియాలో ఆగుతుందా… మరింత శృతి మించి అందాల ప్రదర్శన చేస్తుంది. ఫాలోవర్స్ ని పెంచుకోవడం ద్వారా సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించడంఇప్పుడు సెలెబ్రెటీలకు ఒక మార్గం. అందుకే ఇంస్టాగ్రామ్ లో రెచ్చిపోయి అందాలు వడ్డించేస్తున్నారు. అనసూయ లాంటి వారు అసలు తగ్గడం లేదు. అనసూయను ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు.

ఇక నటిగా అనసూయ సంపాదన కోట్లకు చేరింది. హీరోయిన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న అనసూయకు మంచి డిమాండ్ ఏర్పడింది. సినిమా అవకాశాల మోజులో యాంకరింగ్ కూడా పక్కన పెట్టేసింది. తనకు కెరీర్ ఇచ్చిన జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనసూయ బుల్లితెరపై కనిపించడం లేదు.
అనసూయ హీరోయిన్ గా నటించిన దర్జా, పండుగాడ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో నటిస్తున్నారు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో అనసూయ దేవదాసి పాత్ర చేస్తున్నారు. అలాగే కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.