Anasuya Satirical Post: ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) నిన్న ‘దండోరా'(Dandora Movie) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. అనేక మంది సెలబ్రిటీలు దీనిపై తప్పుబడుతూ శివాజీ కి కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే ‘స్త్రీలకూ చీర నే అందం, కానీ కొంతమంది హీరోయిన్లు సామాన్లు కనిపించే దుస్తులు వేసుకొని, అందులో మా అందం దాగుంది అనుకుంటున్నారు. చూసే ఆడియన్స్ కి దొంగ ముం*** లు ఇలాంటి డ్రెస్ లు వేసొస్తున్నారేంటి, మంచివి వేసుకోలేరా? అని అనాలనిపిస్తుంది. స్త్రీ సాక్షాత్తు ప్రకృతి తో సమానం. అలాంటి స్త్రీలు ఎంత అందంగా కనిపిస్తే, అంత గౌరవం గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. దీనిపై ప్రముఖ గాయని చిన్మయి, అదే విధంగా యాంకర్ అనసూయ(Anchor Anasuya) వంటి వారు స్పందించారు.
చిన్మయి మాట్లాడుతూ ‘అయితే ఆయన కూడా పద్దతిగా ధోతీ కట్టుకొని తిరగమనండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు యాంకర్ అనసూయ ‘ఇది నా శరీరం..నా ఇష్టం’ అంటూ శివాజీ కి పరోక్షంగా కౌంటర్లు ఇచ్చింది. దీనిపై కొంతమంది నెటిజెన్స్ తప్పు అమ్మాయిలు ధరించే దుస్తుల్లో లేదని , అబ్బాయిలు చూసే చూపులో ఉందని అంటున్నారు. మరికొంత మంది అయితే అమ్మాయిలు పద్దతిగా, హుందాగా ఉండడం లోనే అందముంది అంటూ శివాజీ చెప్పిన మాటల్లో తప్పేమి ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇలా హీరోయిన్లు బతల్లిపై తిరుగుతుంటే మండిపడిన సందర్భాలు మనం చూడలేదా?, ఆయన కూడా ఆ ఏజ్ గ్రూప్ కి చెందిన వాడు కాబట్టి, అలా మాట్లాడడం లో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. ఏది ఏమైనా నిన్నటి స్పీచ్ తో సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన శివాజీ నే కనిపిస్తున్నాడు.
ఇకపోతే ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘దండోరా’ చిత్రం ఈ నెల 25 న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో శివాజీ తో పాటు నవదీప్, బిందు మాదవి, రవి కృష్ణ, ఇలా తెలుగు బిగ్ బాస్ సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. కచ్చితంగా పెద్ద హిట్ అయ్యే సినిమాలాగానే అనిపిస్తుంది. చూడాలి మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకుంటుంది అనేది. మూవీ టీం కూడా ప్రొమోషన్స్ విషయం లో అసలు ఎక్కడా తగ్గడం లేదు.