Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో విహరిస్తున్నారు. ఫ్యామిలీతో పాటు అక్కడకు వెకేషన్ కి వెళ్లిన అనసూయ కొన్ని ప్రొఫెషనల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు. అనసూయ ఓ మ్యూజిక్ షోలో సందడి చేసినట్టు సమాచారం. ప్రాంతాన్ని, వేడుకను బట్టి బట్టలు ధరించే అనసూయ సూపర్ హాట్ గా తయారయ్యారు. అనసూయ తన లేటెస్ట్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
యాంకరింగ్ మానేసిన అనసూయ నటిగా బిజీ అయ్యారు. ఆమె వరుస చిత్రాలతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన రంగమార్తాండ, విమానం చిత్రాల్లో అనసూయ కీలక రోల్స్ చేశారు. కథలో ప్రాధాన్యత ఉన్న రోల్స్ దక్కడం విశేషం. రంగమార్తాండ మూవీలో మోడ్రన్ గడసరి కోడలు పాత్ర చేసింది. విమానం చిత్రంలో వేశ్య పాత్ర చేసి అందరికీ షాక్ ఇచ్చారు. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేసే పాత్రలో అనసూయ ఒదిగిపోయి నటించింది.
నెక్స్ట్ అనసూయ ఖాతాలో ఉన్న భారీ చిత్రం పుష్ప 2. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. దాక్షాయణిగా డీగ్లామర్ లుక్ లో కొత్త అనుభూతి పంచనుంది. కాగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు టైటిల్ మూవీ ప్రకటించారు. విలేజ్ పొలిటికల్ డ్రామాగా పెదకాపు తెరకెక్కుతుంది. ఈ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తుంది. టీజర్లో ఆమె లుక్ ఆకట్టుకుంది.
ఇక విజయ్ దేవరకొండతో మొన్నటి వరకు సోషల్ మీడియా వార్ చేసిన అనసూయ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. విజయ్ దేవరకొండ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయించినట్లు తెలిసింది. విజయ్ దేవరకొండకు తెలియకుండా ఆ వ్యక్తి ఈ పని చేశాడని నేను భావించడం లేదు. అందుకే విజయ్ దేవరకొండపై పగ పెంచుకున్నానని అనసూయ అన్నారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టినట్లు అనసూయ అన్నారు. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను, స్పష్టం చేశారు.