Anasuya Bharadwaj : ఆ స్టార్ డైరెక్టర్ ని వదలని అనసూయ… పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా అంటూ స్ట్రాంగ్ కౌంటర్!

అర్జున్ రెడ్డి చిత్ర కంటెంట్, డైలాగ్స్ ని తప్పుబట్టింది. అప్పటి నుంచే విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో ఆమెకు కోల్డ్ వార్ నడుస్తుంది.

Written By: NARESH, Updated On : May 19, 2024 11:38 am

Anasuya Bharadwaj Sandeep Reddy Vanga

Follow us on

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తుంది. పలు రూపాల్లో ఆమెను గొడవలు చుట్టుముడుతూ ఉంటాయి. విజయ్ దేవరకొండ విషయంలో అయితే గెలికి మరీ కాంట్రవర్సీ లేపుతుంది. రెండు మూడు సందర్భాల్లో విజయ్ దేవరకొండను పరోక్షంగా విమర్శిస్తూ పోస్ట్స్ పెట్టింది. ఆగ్రహానికి గురైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అని ట్రోల్ చేశారు. ట్రోలర్స్ కి తనదైన శైలిలో బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది అనసూయ. వెనక్కి తగ్గేది లేదంటుంది.

తాజాగా యానిమల్ దర్శకుడికి చురకలు అంటించింది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ చిత్రంలోని రెండు సన్నివేశాలు షేర్ చేసిన అనసూయ.. మీది హిపోక్రసీ… నన్ను హిపోక్రైట్(కపటధారి) అంటారా? అని కామెంట్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఆ వీడియోలో ఏముంది అంటే…

యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్ తన తండ్రి అనిల్ కపూర్ మీద అటాక్ ప్లాన్ చేసిన సొంత బావను చంపేస్తాడు. తర్వాత అక్కకు నేను బావను చంపానని చెబుతాడు. నువ్వు స్ట్రాంగ్ అండ్ యంగ్ ఉమన్. ఇంకో పెళ్లి చేసుకో. ఈసారి నీకోసం అబ్బాయిని నేను వెతుకుతాను అంటాడు.

ఇదే రన్బీర్ కపూర్ తన భార్య రష్మిక మందానకు మాత్రం వైవిధ్యమైన సలహా ఇస్తాడు. విలన్ తో యుద్దానికి వెళుతూ రన్బీర్ కపూర్… నేను తిరిగి వస్తానో రానో తెలియదు. ఒకవేళ రాకపోతే నువ్వు మాత్రం ఇంకో పెళ్లి చేసుకోకు, అని రష్మిక మందానతో చెబుతాడు. ఈ రెండు వీడియోలు పోస్ట్ చేసిన అనసూయ… మగాళ్లు భార్య విషయంలో ఒకలా, అక్క విషయంలో మరొకలా ఉంటారు. మీరు నన్ను హైపోక్రైట్ అంటారా… అని కామెంట్ చేసింది.

ఇక్కడ ఆమె నేరుగా సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేసింది. కాగా అర్జున్ రెడ్డి మూవీపై అనసూయ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో టీవీ డిబేట్లలో కూర్చుని అనసూయ… అర్జున్ రెడ్డి చిత్ర కంటెంట్, డైలాగ్స్ ని తప్పుబట్టింది. అప్పటి నుంచే విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో ఆమెకు కోల్డ్ వార్ నడుస్తుంది.