Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు బుల్లితెరపై వెండితెర పై ఎన్నో అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ పుష్ప సినిమాలో దాక్షాయని పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అనసూయకు మరొక అద్భుతమైన అవకాశం వచ్చింది.
ఏకంగా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భీష్మపర్వం సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఏకంగా మమ్ముట్టి సినిమా ద్వారా మలయాళ ఎంట్రీ ఇవ్వబోతున్న అనసూయకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంతో పద్ధతిగా కాటన్ చీర ధరించి కళ్ళజోడు పెట్టుకున్నటువంటి అనసూయ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనసూయ మమ్ముట్టికి జోడిగా ఆలిస్ అనే పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
View this post on Instagram
ఈ సందర్భంగా అనసూయ ఈ పాత్ర పై స్పందిస్తూ మీ ఆలిస్‌ను నాలో వెతుక్కునందుకు కృతజ్ఞతలు మమ్ముట్టి గారు అంటూ ట్వీట్ చేసింది. మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంత కన్నా డ్రీమ్ డెబ్యూ మూవీ అవసరం లేదని ఈమె పేర్కొన్నారు. అయితే గతంలో మమ్ముట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో అనసూయ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో అనసూయ నటన పై ప్రశంసలు కురిపించిన మమ్ముట్టి ఏకంగా తనకు భీష్మపర్వంలో అనసూయకు అవకాశం కల్పించారు. ఇక ఈ సినిమా నుంచి అనసూయ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.