https://oktelugu.com/

‘ఖిలాడీ’లో అనసూయ.. రెచ్చిపోనుందా?

అనసూయ భరద్వాజ్ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో గంటలు మోగుతాయి. పెళ్లాయి ఇద్దరు పిల్లలున్న అనసూయ కుర్ర హీరోయిన్లకు ధీటుగా బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంది. బుల్లితెరపై యాంకరింగ్.. సినీ ఈవెంట్లను యమబీజీగా మారిపోయింది. Also Read: ఛార్మీ కొడుకుతో ప్రభాస్.. చూస్తే షాకే..! అనసూయ బుల్లితెరపై గ్లామర్ షోకు ప్రాధాన్యమిస్తుండగా వెండితెరపై మాత్రం ఫార్మమెన్స్ క్యారెక్టర్లనే చేస్తోంది. అనసూయ బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అలాగే సినిమాల్లోనూ నటిగా మంచి గుర్తింపు […]

Written By: , Updated On : November 11, 2020 / 10:02 AM IST
Follow us on

Anasuya

అనసూయ భరద్వాజ్ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో గంటలు మోగుతాయి. పెళ్లాయి ఇద్దరు పిల్లలున్న అనసూయ కుర్ర హీరోయిన్లకు ధీటుగా బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంది. బుల్లితెరపై యాంకరింగ్.. సినీ ఈవెంట్లను యమబీజీగా మారిపోయింది.

Also Read: ఛార్మీ కొడుకుతో ప్రభాస్.. చూస్తే షాకే..!

అనసూయ బుల్లితెరపై గ్లామర్ షోకు ప్రాధాన్యమిస్తుండగా వెండితెరపై మాత్రం ఫార్మమెన్స్ క్యారెక్టర్లనే చేస్తోంది. అనసూయ బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అలాగే సినిమాల్లోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’లో అనసూయ రంగమ్మత్త నటించి అందరి ప్రశంసలను అందుకుంది.

Also Read: రవితేజ ప్లాన్ మారింది.. ‘క్రాక్’ తరువాత.. !

‘రంగస్థలం’ తర్వాత అనసూయ రంగమ్మత్తగా ఫేమ్ అయింది. ఈ మూవీ తర్వాత అనసూయకు రంగమ్మత్త లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ రాలేదని తెలుస్తోంది. దీంతో అనసూయ తన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. తాజాగా అనసూయ రవితేజ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

రమేష్ వర్శ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో అనసూయ ఓ హాట్ క్యారెక్టర్లో నటిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఈ మూవీలో అనసూయ చాలా స్టైలీష్ గా.. గ్లామర్ గా కన్పించనుందట. ‘ఖిలాడీ’తో ఆమెకు మరో రకమైన ఇమేజ్ రావడం ఖాయమనే చిత్రబృందం నమ్మకంతో చెబుతోంది. ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ‘ఖిలాడీ’ పట్టాలెక్కనుందని సమాచారం.