Ananya Panday: హీరోయిన్లు తమ జీవితాల్లో పెళ్లి అనే దాన్ని పెద్ద అడ్డంకిలా భావిస్తారు. అందుకే, సినీ జర్నలిస్ట్ లు పెళ్లి ఎప్పుడు ? అనగానే వారి పై సీరియస్ లుక్స్ ఇస్తుంటారు. ఇక కొందరు హీరోయిన్లు అయితే.. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు చాలా ఫేక్ సమాధానాలు చెబుతూ ఉంటారు. పైగా.. అవి పచ్చి నిజాలు అన్నట్టు వాళ్ళు నమ్ముతూ మనల్ని కూడా నమ్మించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చాలా చిత్రంగా అనిపిస్తుంటాయి.

అసలు ఓవైపు డేటింగ్ చేస్తూ, మరోవైపు పెళ్లి గురించి ఆలోచించడం లేదు అంటారు. తాప్సి, రాధికా ఆప్టే, శృతి హాసన్ లాంటి కొందరు ప్రేమిస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెబుతుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకా టైమ్ ఉందని తప్పించుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ అనన్య పాండే వంతు వచ్చింది. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు అనన్య పాండే భలే తెలివిగా సమాధానం ఇచ్చింది.
Also Read: Telugu Heroines Caste: మన టాప్ 21 తెలుగు హీరోయిన్ల కులాలేంటో తెలుసా.?
ఇంతకీ అనన్య పాండే ఏమి చెప్పిందో తెలుసా ? మా అమ్మానాన్నను అడిగి చెబుతానంది. ఈ ఒక్క సమాధానంలో బోలెడన్ని అర్ధాలు ఉన్నాయని అంటుంది. తాను ఇంతవరకు ఎవ్వర్నీ లవ్ చేయలేదని చెబుతుంది. ఒకవేళ తనకు పెళ్లి చేసుకొవాలని అనిపిస్తే… ఇంట్లో సంబంధాలు చూడమని చెబుతుందట.

అదేమిటి ? అనన్య పాండే ఆల్రెడీ చాలాసార్లు ప్రేమలో పడింది కదా.. ఇప్పుడు ఏమిటి అసలు తనకు ప్రేమ అంటేనే తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది. గతంలో అనన్య పాండే ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ కూడా చేసింది. పబ్ ల చుట్టూ విచ్చలవిడిగా తిరిగింది. మళ్ళీ ఇప్పుడు మాత్రం అమ్మ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెబుతుంది.
అనన్య పాండే ఆన్సర్ పై ఇలానే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనన్య పాండే మాత్రం ఇంతకుమించి వివరణ ఇవ్వలేదు. విజయ్ దేవరకోండ సినిమాతో తెలుగులో కూడా అనన్య పాండే పాపులర్ అవుతుంది. నిజానికి అనన్య పాండే సినిమాలలో కంటే, బయటే హాట్ ఫొటోషూట్స్ తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
Also Read:Pakka Commercial Collections: ఫమార్కెట్ లేని హీరో.. వయసు అయిపోయిన హీరోయిన్ ఒక్కటే
[…] Also Read: Ananya Panday: విచ్చలవిడిగా తిరిగేసింది.. పెళ్… […]
[…] Also Read:Ananya Panday: విచ్చలవిడిగా తిరిగేసింది.. పెళ్… […]