https://oktelugu.com/

Trivikram: త్రివిక్రమ్ కసరత్తులు.. అనన్య పాండేకి అవకాశం !

Trivikram: మాటల మాంత్రికుడు అంటూ ‘త్రివిక్రమ్’కి ఒక ముద్ర వేశారు గానీ, నిజానికి త్రివిక్రమ్ మంచి కమర్షియల్ డైరెక్టర్. ఒక సినిమాను అన్నీ విధాలుగా పర్ఫెక్ట్ గా రెడీ చేసి హిట్ చేయడంలో త్రివిక్రమ్ ను మించిన వాళ్ళు తెలుగులో లేరు. అదేంటి.. రాజమౌళి ఉన్నాడు కదా అంటే.. జక్కన్న కంటే చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి బాగా క్యాష్ చేసుకోవడంలో త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబుతో చేస్తున్న […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 11:48 AM IST
    Follow us on

    Trivikram: మాటల మాంత్రికుడు అంటూ ‘త్రివిక్రమ్’కి ఒక ముద్ర వేశారు గానీ, నిజానికి త్రివిక్రమ్ మంచి కమర్షియల్ డైరెక్టర్. ఒక సినిమాను అన్నీ విధాలుగా పర్ఫెక్ట్ గా రెడీ చేసి హిట్ చేయడంలో త్రివిక్రమ్ ను మించిన వాళ్ళు తెలుగులో లేరు. అదేంటి.. రాజమౌళి ఉన్నాడు కదా అంటే.. జక్కన్న కంటే చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి బాగా క్యాష్ చేసుకోవడంలో త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబుతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు.

    Ananya Panday

    ప్రజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాకి బజ్ క్రియేట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. మరి అలా బజ్ క్రియేట్ అవ్వాలి అంటే.. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ఇతర భాషల అభిమానులు కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపించాలి. మరి అలా చూపించాలి అంటే.. ఆ భాషలోని స్టార్ నటీనటులను ఈ సినిమాలో భాగం చేయాలి.

    మొత్తానికి మహేష్ సినిమా కోసం.. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. అందులో భాగంగా హిందీ బ్యూటీ అనన్య పాండేకి బంఫర్ ఆఫర్ తగిలింది. మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశాడు త్రివిక్రమ్. మరో హీరోయిన్ గా అనన్య పాండే ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

    అందంలో అభినయంలో ‘అనన్య పాండే’కి తిరుగులేదు. మరోపక్క ఆమె కెరీర్ కూడా బాగుంది. అన్నిటికీ మించి హిందీ యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇప్పుడు మరో హీరోయిన్ గా అనన్య పాండేను త్రివిక్రమ్ ఖాయం చేశాడు. పేరుకి సెకెండ్ హీరోయిన్ అయినప్పటికీ సినిమాలో కమర్షియల్ సీన్స్ అన్నీ అనన్య పాండే చుట్టూ తిరుగుతాయట.

    Also Read: Vijay Devarakonda: భయంలో విజయ్ దేవరకొండ.. డేట్స్ ఇవ్వాలా ? హ్యాండ్ ఇవ్వాలా ?

    అనన్య పాండే మీదే రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా తర్వాత అనన్య ఖాతాలో పెద్ద సినిమాలు పడతాయి. అందుకే అనన్య కూడా ఈ సినిమా పై ఆసక్తిగా ఉంది. మరి ఈ సినిమాతో అనన్య పాండే దశ ఏ రేంజ్ లో తిరుగుతుందో ! వావ్‌ అనిపించేలా ఉండే అనన్య పాండేకి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ పుష్కలంగా ఉన్నాయి.

    Also Read: Rajamouli: అసలు పాన్​ ఇండియా సినిమా అంటే అర్థమేంటో తెలుసా-రాజమౌళి

    Tags