Homeఎంటర్టైన్మెంట్Anand Devarakonda Epic Teaser Review: ఆనంద్ దేవరకొండ 'EPIC' టీజర్ రివ్యూ...

Anand Devarakonda Epic Teaser Review: ఆనంద్ దేవరకొండ ‘EPIC’ టీజర్ రివ్యూ : ఈ రేంజ్ వైల్డ్ రొమాన్స్ ఊహించలేదు..

Anand Devarakonda Epic Teaser Review: ‘బేబీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) , వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) మరోసారి జంటగా కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎపిక్'(Epic Teaser). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహనిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. USA లో స్థిరమైన ఒక అమాయకపు కుర్రాడికి , మోడరన్ ఆలోచనలు ఉన్న అందమైన అమ్మాయి తోడైతే , ఎలాంటి పరిణామాలు ఎదురు అవుతాయి అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు గ్లింప్స్ వీడియో ని చూసినప్పుడు తెలిసింది. అయితే నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ కి మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.

ఒక మంచి లవ్ స్టోరీ ని తీసే ప్రయత్నం డైరెక్టర్ చేసాడని అనిపించింది కానీ, టీజర్ లో సగానికి పైగా వైల్డ్ రొమాన్స్ తప్ప కథ ని ఎక్కువ రివీల్ చెయ్యలేదని నెటిజెన్స్ అంటున్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య అయితే రొమాన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది. బేబీ చిత్రం లో కూడా రొమాన్స్ ఉంది కానీ, ఈ రేంజ్ రొమాన్స్ మాత్రం లేదు. ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు అమ్మాయి ఇంతటి బోల్డ్ సన్నివేశాల్లో నటించడం చాలా అరుదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ టీజర్ లో సీనియర్ హీరో శివాజీ కూడా కనిపించాడు. శివాజీ కి జోడిగా వాసుకి నటించింది. వీళ్లిద్దరు ఈటీవీ విన్ యాప్ లో సెన్సేషన్ సృష్టించిన 90’s అనే వెబ్ సిరీస్ లో జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో కూడా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరిందని టీజర్ ని చూసిన వాళ్ళు అంటున్నారు. ఇందులో వీళ్లిద్దరు ఆనంద్ దేవరకొండ కి తల్లిదండ్రులు గా నటించారు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము , చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

 

 

EPIC - Teaser | Anand Deverakonda, Vaishnavi Chaitanya | Hesham AW | Naga Vamsi S | Aditya Hasan

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version