Anaganagaa Oka Raju twitter review : యంగ్ హీరోల్లో టాలెంట్ పవర్ హౌస్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty). క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టిన నవీన్, ఆ తర్వాత కొన్నాళ్ళు బాలీవుడ్ లో ఒక ప్రముఖ టీవీ షోకి యాంకర్ గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా వచ్చిన ఫేమ్ తో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే చిత్రం చేసి, తొలి సినిమాతోనే హీరో గా అంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ చిత్రం తర్వాత విడుదలైన ‘జాతి రత్నాలు’ కూడా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ నవీన్ పోలిశెట్టి తన ప్రతీ సినిమాకు రెండేళ్ల గ్యాప్ తీసుకోవడం చాలా పెద్ద మైనస్ అవుతుంది. జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం చేసాడు. ఇది కూడా హిట్ అయ్యింది.
ఇప్పుడు మళ్లీ రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘అనగనగా ఒక రాజు'(Anaganagaa Oka Raju) మూవీ తో నేడే మన ముందుకొచ్చాడు. విడుదలకు ముందు నుండే మంచి పాజిటివ్ వైబ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఆడియన్స్ నుండి అదే రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుండా లేదా అనేది చూద్దాం. ట్విట్టర్ ఆడియన్స్ ప్రకారం నవీన్ మరోసారి హిట్ కొట్టేసాడు అని తెలుస్తోంది. సినిమాలో అక్కడక్కడా కొన్ని డ్రాప్స్ అయితే ఉన్నాయి, ఓవరాల్ గా ఒక సాధారణమైన టైం పాస్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ నవీన్ పోలిశెట్టి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సినిమా మొత్తాన్ని నడిపించాడని అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ, నవీన్ కవర్ చేసేశాడని అంటున్నారు. క్లైమాక్స్ కూడా చాలా డీసెంట్ గా హ్యాండిల్ చేసాడట.
నవీన్ పోలిశెట్టి మరోసారి తానూ ఎందుకు అద్భుతమైన ఎంటర్టైనర్ అని అందరూ అంటారో ఈ చిత్రం ద్వారా నిరూపితమైందని అంటున్నారు చూసిన వారంతా. ఇప్పటి వరకు నవీన్ చేసిన సినిమాలు ఆయన నటన వల్లే మరో లెవెల్ కి వెళ్లి సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం కూడా అలాంటిదే అని అంటున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, పవన్ కళ్యాణ్ లు కూడా ఇలాగే ఉండేవారు. సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ , తమ ఎనర్జీ తో, కామెడీ టైమింగ్ మరియు ఇతర ఎమోషన్స్ తో అద్భుతంగా ఉండేలా చేస్తారు. అలాంటి టాలెంట్ నవీన్ పోలిశెట్టి కి ఉందని అంటున్నారు ఆడియన్స్. ఇకపోతే ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ‘అనగనగా ఒక రాజు’ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉంది.