Anaganaga Oka Raju Profits: ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో, భారీ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘అనగనగా ఒక రాజు'(Anaganaga oka raju Movie). నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ దున్నేస్తున్నప్పటికీ కూడా, ఈ చిత్రం సక్సెస్ అయ్యింది అంటే, సాధారణమైన విషయం కాదు. మొదటి మూడు సినిమాల విజయాలతో నవీన్ పోలిశెట్టి ఆడియన్స్ లో సంపాదించుకున్న నమ్మకం బలమైనది కాబట్టే సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా సూపర్ హిట్ అయిపోయింది. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బయ్యర్స్ కి దాదాపుగా 21 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.
అయితే ఈ చిత్ర నిర్మాత నాగవంశీ కి ఈ లాభాల్లో ఒక్క రూపాయి కూడా దక్కే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కారణం ఆయన గత చిత్రాలు బయ్యర్స్ కి చేసిన నష్టాలే. ‘వార్ 2’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ కి భారీ ఫ్యాన్సీ రేట్స్ కి అమ్మేశాడు. కానీ ఆ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దీంతో బయ్యర్స్ నిర్మాత నాగవంశీ పై తమకు ఇవ్వాల్సిన జీఎస్టీ డబ్బులు, అదే విధంగా రీకవరీ డబ్బులు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఒత్తిడి చేశారు. కానీ నాగవంశీ డబ్బులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేనని, రవితేజ ‘మాస్ జాతర’ ని తక్కువ రేట్స్ కి ఇస్తానని, వాటి నుండి వచ్చిన లాభాలను మీరే ఉంచుకోండి అని చెప్పాడట. అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
నాగవంశీ కి బయ్యర్స్ ఇచ్చిన అడ్వాన్స్ లను కూడా రీకవర్ చేయలేకపోయింది ‘మాస్ జాతర’ చిత్రం. దీంతో నాగవంశీ తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ని కూడా తక్కువ రేట్స్ కి బయ్యర్స్ కి ఇచ్చేసాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది, 21 కోట్ల రూపాయిల లాభం కూడా వచ్చింది. కానీ అవన్నీ పాత బాకీలలో చెల్లు చేసుకోగా 10 కోట్ల రూపాయిలు మిగిలింది. ఈ అమౌంట్ క్లియర్ చేసేలోపు, అదే బయ్యర్స్ కి విశ్వక్ సేన్ ‘ఫంకీ’ చిత్రాన్ని ఇచ్చాడు నాగవంశీ . రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. బయ్యర్స్ కి డబుల్ నష్టాలను తెచ్చిపెట్టింది. చూస్తుంటే ఇప్పుడు మిగిలిన ఆ 10 కోట్లు కూడా నాగవంశీ కి దక్కేలా లేదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.