Anaganaga Oka Raju collection: ఈ సంక్రాంతి బరిలో దిగిన నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంది. కానీ 100 కోట్ల భారీ టార్గెట్ ని మాత్రం అందుకోలేకపోయింది. సంక్రాంతి సెలవలు ముగిసిన తర్వాత ఈ సినిమా జోరు బాగా తగ్గిపోయింది. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రాన్ని శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం డామినేట్ చేసింది. ఇలా పండగ తర్వాత తగ్గిపోవడానికి కారణం, సినిమాలో ఆ రేంజ్ కంటెంట్ లేకపోవడమే. కేవలం నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ వల్లే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందని సోషల్ మీడియాలో విడుదలైన రెండవ రోజు నుండే ప్రచారం సాగుతోంది. 3 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
21వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి . ఇక నైజాం ప్రాంతం లో మూడు వారాలకు కలిపి ఈ చిత్రానికి 12.44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా ఊపు ని చూసి కచ్చితంగా ఈ ప్రాంతంలో 20 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 4.21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 7.23 కోట్లు, ఈస్ట్ గోదావరి నుండి 4.09 కోట్లు, వెస్ట్ గోదావరి నుండి 2.23 కోట్లు, గుంటూరు నుండి 2.53 కోట్లు, కృష్ణ జిల్లా నుండి 2.10 కోట్లు, నెల్లూరు నుండి 1.44 కోట్ల రూపాయిల షేర్స్ ని రాబట్టింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 36.27 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు 61.80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3.11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ ప్రాంతం నుండి అక్షరాలా 8.73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 48.11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 87.4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్లకు దాదాపుగా 28 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. వంద కోట్ల టార్గెట్ ని అందుకొని ఉండుంటే బాగుండేది కానీ, దగ్గరగా వచ్చి ఆగిపోయింది, నవీన్ బ్యాడ్ లక్ అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.