Bigg Boss 9 grand finale: చూస్తూ ఉండగానే ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) అప్పుడే చివరి దశకు వచ్చేసింది. గత వారం లో నామినేషన్స్ లోకి వచ్చిన దివ్య ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం నామినేషన్స్ లోకి కెప్టెన్ పవన్ కళ్యాణ్ తప్ప అందరూ వచ్చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 21 న జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ హౌస్ ఫినాలే వీక్ కి టాప్ 6 కంటెస్టెంట్స్ ని ఉంచుతారా? , లేకపోతే టాప్ 5 కంటెస్టెంట్స్ ని ఉంచుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బిగ్ బాస్ టీం అయితే టాప్ 6 కంటెస్టెంట్స్ ని ఉంచితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. అదే కనుక జరిగితే ఈ వారం, వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఒకవేళ టాప్ 5 ని హౌస్ లో ఉంచాలని అనుకుంటే ఈ రెండు వారాల్లో ఎదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే గత సీజన్ ఫినాలే ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సీజన్ కి కూడా ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. వచ్చే నెలలో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషనల్ కార్యక్రమాలను ఈ నెల రెండవ వారం నుండి మొదలు పెట్టొచ్చు. అందులో భాగంగా బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడని టాక్. గతం లో చిరంజీవి సీజన్ 3 , సీజన్ 4 లకు ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
కంటెస్టెంట్స్ తో ఆయన ఫినాలే రోజున సరదాగా మాట్లాడిన మాటలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సీజన్ లో కూడా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, కంటెస్టెంట్స్ తో సరదాగా గడపబోతున్నాడని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే చేయబోతున్నారట. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనేది ప్రస్తుతానికి చాలా సస్పెన్స్ గా మారింది. తనూజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ లతో పాటు డిమోన్ పవన్ కి కూడా సరిసమానం గా అవకాశాలు ఉన్నాయి. టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే దానిపై ఉత్కంఠ ఈ రేంజ్ లో ఏ సీజన్ కి కూడా లేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.