https://oktelugu.com/

Pushpa Song On America: అమెరికన్ రియాలిటీ షోలో పుష్ప సాంగ్… పెర్ఫార్మన్స్ కి జడ్జెస్ మైండ్ బ్లాక్

ఈ వారియర్ స్క్వాడ్ హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ దగ్గర్లో గల ఒక చిన్న గ్రామానికి చెందింది. ఓ NGO వారికి సహాయం చేసింది. అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులు భరించింది. ఆ విధంగా వారియర్ స్క్వాడ్ టీమ్ కి అమెరికన్ షోలో పాల్గొనే అవకాశం దక్కిందట. ఇక ఈ షో విన్నర్స్ కి పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీగా అందిస్తారని సమాచారం.

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2023 / 10:42 AM IST

    Pushpa Song On America

    Follow us on

    Pushpa Song On America: తెలుగు సినిమా కీర్తి అంతకంతకు పెరుగుతుందనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. తెలుగు సినిమాకు ఆస్కార్ కలలో కూడా ఊహించనిది. అలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డు ఆర్ ఆర్ ఆర్ మూవీతో దక్కింది. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. అలాగే నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సైతం కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే పుష్ప మూవీ సాంగ్ అమెరికన్ షోలో సందడి చేసింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ యూఎస్ లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో.

    గత 17 సీజన్స్ గా ఆదరణ దక్కించుకుంటుంది. 18వ సీజన్ ఇటీవల ప్రారంభమైంది. ఈ షోలో ఇండియాకు చెందిన వారియర్ స్క్వాడ్ అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నారు. డాన్స్ ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు గాను వారు పుష్ప మూవీలోని ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ ఎంచుకున్నారు. అది కూడా తెలుగు వెర్షన్ కి డాన్స్ చేశారు. వారియర్ స్క్వాడ్ పెరఫామెన్స్ కి ఆడియన్స్, జడ్జెస్ ఫిదా అయ్యారు. సాంగ్ ముగిశాక స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

    ఈ వారియర్ స్క్వాడ్ హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ దగ్గర్లో గల ఒక చిన్న గ్రామానికి చెందింది. ఓ NGO వారికి సహాయం చేసింది. అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులు భరించింది. ఆ విధంగా వారియర్ స్క్వాడ్ టీమ్ కి అమెరికన్ షోలో పాల్గొనే అవకాశం దక్కిందట. ఇక ఈ షో విన్నర్స్ కి పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీగా అందిస్తారని సమాచారం.

    కాగా 2021లో విడుదలైన పుష్ప ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉహించని రెస్పాన్స్ దక్కింది. అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యారు. పుష్ప హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అక్కడ సంచనాలు చేసింది. నార్త్ ఇండియన్స్ లో పుష్ప చిత్రానికి ఈ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. త్వరలో పుష్ప 2 తో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ దున్నేయనున్నాడు.