Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh: పూరి.. నీ మార్క్ ఎలా మిస్ అయ్యింది.. ఇలా అయితే సంక...

Puri Jagannadh: పూరి.. నీ మార్క్ ఎలా మిస్ అయ్యింది.. ఇలా అయితే సంక నాకి పోతావ్

Puri Jagannadh: లైగర్’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి అసలు ఏం బాగాలేదు. ఇప్పటికే థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం బుకింగ్స్ కూడా ఏమి బాగాలేదు. ముఖ్యంగా లైగర్ సినిమా, స్క్రిప్ట్ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. మెయిన్ గా పూరి పై భారీగా నెగిటివ్ టాక్ నడుస్తోంది. పూరి పాత కాలపు ఆలోచనలను వదులుకోలేక పోతున్నాడు అని సోషల్ మీడియాలో పూరిను బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు స్టార్ హీరో విజయ్ దేవరకొండనే హీరోగా పెట్టుకుని పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ లో ఇలాంటి చెత్త సినిమా ఎలా తీశాడా అని అందరూ షాక్ అవుతున్నారు. పాపం విజయ్ దేవరకొండ తన కెరీర్ ను తీసుకెళ్ళి పూరి చేతిలో పెట్టాడు. పూరి మొత్తానికి లైగర్ అంటూ భారీ డిజాస్టర్ ఇచ్చాడు. అసలు పూరి నుంచి ‘లైగర్’ లాంటి బోరింగ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు. ఏది ఏమైనా లైగర్ సినిమా విషయంలో పూరి మార్క్ మిస్ అయ్యింది. తాజాగా ఓ అభిమాని పూరికి ఓ లెటర్ రాశాడు.

Puri Jagannadh
Puri Jagannadh

ఈ లెటర్ లో పూరి పై పదునైన విమర్శనాస్త్రాలను సంధించాడు. దాంతో ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఈ లెటర్ లో ఏముందో మీరు కూడా ఒక లుక్కెయ్యండి. ఆ అభిమాని మాటల్లోనే.. ‘ముందుగా ఇలా మాట్లాడుతున్నందుకు ఐ యామ్ సారీ.. పూరి నేను నీ సినిమాలకు పెద్ద అభిమానిని. చాలా కాలంగా నేను ‘లైగర్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. మొదటి రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా చూడలేకపోయాను. మొదటి రోజు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా ‘సినిమా బాలేదు, మీ వాడి పని అయిపోయింది.

Also Read: Nagarjuna Birthday: నాగార్జున బర్త్‌ డే విషెస్ : నాగ్ కి ఏ స్టార్ ఏ విధంగా విషెస్ చెప్పారంటే ?

‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్లూక్ హిట్టు’ అంటూ రకరకాల విమర్శలు చేశారు. అవేమి నేను పట్టించుకోలేదు. అయినా సరే ఒక్క రివ్యూ కూడా చదవకుండా నేను ఆదివారం రోజున థియేటర్ కు వెళ్లి సినిమా చూశాను. నాతో పాటు ఎవ్వరినీ తీసుకెళ్లలేదు. నేను సినిమా ఫోకస్డ్ గా చూడాలి.. నీ సినిమాల్లో ఉండే ఫిలాసఫీ ని అర్ధం చేసుకోవాలి అనేది నా ప్రధాన ఉద్దేశం. అలానే వెళ్లాను.. సినిమా చూశాను. సినిమా ప్లాప్ అయినందుకు, ఫ్రెండ్స్ బాలేదు అన్నందుకు నేను ఏ మాత్రం బాధపడలేదు. ఏ దర్శకుడికి అయినా హిట్స్ ప్లాప్స్ అనేవి కామన్. కాకపోతే నేను బాధపడిందల్లా.. నాకు తెలిసిన పూరి మార్క్, నేను ఎంజాయ్ చేసే పూరి టేకింగ్.. ఈ సినిమాలో కనిపించలేదు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాన్ని ఎవరో బాలీవుడ్ డైరెక్టర్ రీమేక్ చేసి.. మళ్ళీ దాన్ని తెలుగులోకి డబ్ చేసినట్టు ఉంది సినిమా. నీ మార్క్ ఎలా మిస్ అయ్యింది పూరి ?.

Puri Jagannadh
Puri Jagannadh

‘గోలీమార్’ లో ఓ మంచి డైలాగ్ రాశావు. ’10 మందిని మోసం చేస్తే నువ్వు కనీసం బాగుపడతావ్, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంక నాకి పోతావ్’ అని..! నా కర్మ నువ్వు రాసిన డైలాగ్ నేను నీకు గుర్తు చేయాల్సి వస్తుంది. అర్జెంట్ గా నీ టీం ని మార్చెయ్యి. లేదు అంటే వాళ్ళను నిజాలు చెప్పమని చెప్పు.’అవును అంటే అవును.. కాదు అంటే కాదు.. బాగుంటే బాగుంది అని బాలేదు అంటే బాలేదు అని చెప్పమను. నీ సినిమాలు ప్లాప్ అయినా వాటికి, నీకు ఓ రెస్పెక్ట్ ఉంటుంది పూరి. ‘లైగర్’ సినిమాకి అది దక్కలేదు అని నా బాధ. నువ్వు తీసిన ‘రోగ్’ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఇంత ఇబ్బంది కలగలేదు. ‘లైగర్’ కి చాలా డిజప్పాయింట్ చేశావ్. మొన్న సుకుమార్ తో కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం గురించి చాలా బాగా చెప్పావు. కాదు కాదు గొప్పగా చెప్పావు. కానీ నువ్వెప్పుడు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తావు? నువ్వు ఇప్పుడు పూర్తిగా కంఫర్ట్ జోన్ లో ఉండిపోయావు తెలుసా? ఆ ‘పూరి కనెక్ట్స్’ నుండి బయటకు వచ్చి ఓ సినిమా తియ్యి. ఇది నా హార్ట్ ఫుల్ రిక్వెస్ట్. మాకు నువ్వు ప్రతీసారి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వనవసరం లేదు. నాకు వింటేజ్ పూరిని చూపించు. కనీసం చూపించడానికి ట్రై చెయ్యి. ప్రతి సారి ‘ఇడియట్’ ‘పోకిరి’ అవసరం లేదు. కడుపు మండితే ‘బిజినెస్ మెన్’ సినిమా తీశాను అని చెప్పావు కదా. నాకు కడుపు మండి ఇలాంటి లెటర్ రాస్తున్నాను. ‘బిజినెస్ మెన్’ లాంటి సినిమా ఒకటి ఇవ్వు అంటూ ఆ అభిమాని ఇలా లెటర్ రాసుకొచ్చాడు.

Also Read:IND Vs PAK: ఇండియా-పాక్ మ్యాచ్ ను కళ్లప్పగించి చూసిన కోటిన్నరమంది.. డిజిటల్ యుగానికి ఇదే నాంది

 

https://www.youtube.com/watch?v=5THwJgxJGv0

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular