Project K Amitabh Look: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కురుక్షేత్రం జరుగుతున్న కాలానికి వెళ్లే ప్రక్రియే ‘ప్రాజెక్ట్ K’.
ఇందులో ప్రభాస్ మరియు దీపికా పదుకొనే హీరో హీరోయిన్లు గా నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యమైన పాత్ర ని పోషిస్తున్నాడు.ఆయన పాత్రకి సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ గెటప్ చూస్తూ ఉంటె ఇందులో ఆయన అశ్వద్దామా పాత్ర ని చేస్తున్నట్టు అర్థం అవుతుంది. ఎప్పటి నుండో సోషల్ మీడియా లో దీని గురించి ప్రచారం ఉండేది కానీ, ఇప్పుడు ఆ లుక్ చూసిన తర్వాత అందరూ ఖరారు చేసేసుకున్నారు.
విషయం లోకి వెళ్తే కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దుర్యోధనుడు , అశ్వద్దామా ని కురు వంశాన్ని నాశనం చేయాల్సిందిగా కోరుతాడు. అప్పుడు అశ్వద్దామా శశిరేఖ గర్భం లోకి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దీనికి ఆగ్రహించిన శ్రీ కృష్ణుడు అశ్వద్దామా ని జీవితాంతం కురూపి గా జీవిస్తావు, నీకు మరణం అనేదే ఉండదు. ఇలాగే నరకం అనుభవిస్తూ ఈ భూమి ఉన్నంత కాలం జీవిస్తావు అని శపించి, ఆయన నెత్తి మీద ఉన్న మణి ని తన సుదర్శన చక్రం తో పగలగొడుతాడు.
అప్పటి నుండి కురూపి గానే జీవిస్తున్న అశ్వద్దామా నేటి తరం లోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే ప్రాజెక్ట్ K స్టోరీ. ఆయన నెత్తి మీద ఉన్న మణి విరిగినట్టుగా అమితాబ్ బచ్చన్ గెటప్ ని మనం ఈ లుక్ లో గమనించొచ్చు. ఇక ఈ సినిమాలో విలన్ గా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ నటించబోతున్నాడట. ఆగష్టు నుండి ఆయన షూటింగ్ పాల్గొనబోతున్నాడు.