Chiranjeevi On Amitabh Bachchan: లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ 81వ ఏట అడుగు పెట్టారు. 1942 అక్టోబర్ 11న జన్మించిన అమితాబ్ బుధవారం జన్మదినం జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుండి అమితాబ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చిత్ర ప్రముఖులు సైతం ప్రత్యేకంగా విష్ చేశారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. చిరంజీవి ప్రతి ఏడాది అమితాబ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. నిన్న ట్విట్టర్ వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు.
81వ జన్మదిన శుభాకాంక్షలు గురూజీ అమితాబ్ బచ్చన్. ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో సుధీర్ఘకాలం జీవించాలి. మీ నటనతో కోట్ల మందిలో స్ఫూర్తి నింపుతూ, వినోదం పంచాలి… అని చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేలా అద్భుతమైన ఫోటోలు షేర్ చేశారు. చిరంజీవి పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ గెస్ట్ రోల్ చేశారు.
అంతకు ముందే పలు సందర్భాల్లో అమితాబ్-చిరంజీవి కలిశారు. చిరంజీవి బర్త్ డే ట్వీట్ అమితాబ్ మీద ఆయనకున్న ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా వెలిగిపోయిన అమితాబ్ వయసు పెరిగాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. అలాగే ఆయన వయసుకు తగ్గ లీడింగ్ రోల్స్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఆయన నటిస్తున్నారు. ఒక దశలో అమితాబ్ ఆర్థికంగా సర్వం కోల్పోయారు. ఆ సమయంలో కోన్ బనేగా కరోడ్ పతి షోతో కమ్ బ్యాక్ అయ్యారు.
అమితాబ్ హోస్ట్ చేసిన కోన్ బనేగా కరోడ్ పతి ట్రెండ్ సెట్ చేసింది. ఎనబై ఏళ్ల వయసులో కూడా ఆయన నట ప్రస్థానం కొనసాగుతుంది. వృద్యాపంలో కూడా కరోనా బారినపడిన ఆయన కోలుకోవడం విశేషం. వయసులో ఉన్నవాళ్ళనే ఆ మహమ్మారి కబళించింది. అమితాబ్ మనో ధైర్యంతో ఎదిరించి నిలిచారు. ప్రస్తుతం అమితాబ్ కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్నారు. ఆయన కీలక రోల్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది.
A Very HAPPY 81st BIRTHDAY
Guru Ji @SrBachchan !May you be blessed with a long life, filled with happiness & good health!
May you keep enthralling & inspiring millions of us for many many years to come, with your acting genius!!This Birthday of yours is also… pic.twitter.com/bLQY3OjwkU
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2023