Amitabh Bachchan House Selling
Amitabh Bachchan : ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని అమ్మేశాడు. ముంబై లోని అంధేరి ప్రాంతం లో చాలా కాలం క్రితం ఆయన ఒక ఖరీదైన డుప్లెక్స్ ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఫ్లాట్ ని 83 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. ఈ ఫ్లాట్ దాదాపుగా 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో ఉంటుంది. 6 కార్లు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్ ని విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేసారు. గత కొంతకాలం నుండి అమితాబచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్ రంగం లో 200 కోట్ల రూపాయిల వరకు పెట్టుబడులు పెట్టింది. ఈమధ్య కాలంలో కొంత నష్టం జరగడం వల్లే ఈ విలువైన ఫ్లాట్ ని అమ్మేశారని బాలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది.
ఈ ఫ్లాట్ ని అమ్మడం కుటుంబం లో ఎవరికీ ఇష్టం లేదని, కేవలం అభిషేక్ బచ్చన్ ఒత్తిడి చేయడం వల్లే అమ్మే పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది. అమితాబ్ బచ్చన్ ఒకానొక సమయం లో తీవ్రమైన అప్పులపాలై ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ఆయన చాలా బలంగా నిలబడి, ఎన్నో కష్టాలను ఎదురుకొని, వరుసగా సినిమాలు చేస్తూ కోల్పోయిన ఆస్తులు మొత్తం తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆయన సంపాదన తో కట్టుకున్న ఇల్లు ఇది. అలాంటి ఇల్లు ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి రావడం తో ఆయన అభిమానులు కూడా అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే 82 ఏళ్ళ వయస్సులో కూడా అమితాబ్ బచ్చన్ చాలా చురుగ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కి బాలీవుడ్ లో ఇంత డిమాండ్ లేకపోవడం గమనార్హం.
కెరీర్ ప్రారంభంలో పలు సూపర్ హిట్స్ కొట్టి మరో అమితాబ్ బచ్చన్ అవుతాడని అభిమానులు ఆశించారు కానీ, ఆ తర్వాత సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోకపోవడం వల్ల వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఫలితంగా ఆయన సెకండ్ హీరో గా స్థిరపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ సెకండ్ హీరో రోల్స్ కూడా రావడం లేదు. ఇక అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే ఈ వయస్సులో కూడా ఆయన కల్కి లో భారీ ఫైట్స్ చేసే రోల్స్ చేస్తున్నాడు. ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకడు అమితాబ్ బచ్చన్. వెండితెర మీద అశ్వద్దామా గా ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు వింటేజ్ అమితాబ్ బచ్చన్ ని తలపించాయి. త్వరలోనే ఆయన కల్కి సీక్వెల్ లో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి.