Allu Arjun and Amitabh Bachchan : దేశం మొత్తం ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘పుష్ప 2’ చిత్రం తో ఆయన ఇప్పటి వరకు ఏ సూపర్ స్టార్ క్రియేట్ చేయని అద్భుతమైన రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ, తన సత్తా తో మన తెలుగు సినీ పరిశ్రమని మరో మెట్టు పైకి ఎక్కించాడు. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అనేది ఇప్పుడు మన పాన్ ఇండియన్ స్టార్స్ కి ఒక ఘనత లాంటిది. కానీ అల్లు అర్జున్ ఆ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వారం రోజులు కూడా ముగియకుండానే కొల్లగొట్టబోతున్నాడు. ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసిన విషయం. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ఈ చిత్రం విడుదలకు ముందు బాలీవుడ్ లో అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఎన్నో ఈవెంట్స్ ని కూడా నిర్వహించాడు.
ఈ ఈవెంట్స్ లో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతాడు. ఎన్నో దశాబ్దాల నుండి అమితాబ్ బచ్చన్ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు. ఆయన నుండి మేమంతా ఎంతో నేర్చుకున్నాం. ముఖ్యంగా మాకు ఆయన ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత. ఆయన చూపించిన మార్గం లోనే మేమంతా నడుస్తున్నాం అంటూ అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనికి అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ ‘ధన్యవాదాలు అల్లు అర్జున్. మీరు నా అర్హతకు మించి ఎక్కువ ప్రశంసించారు. నిజంగా చెప్పాలంటే నేను మీ టాలెంట్ కి, మీ డెడికేషన్ కి, మీరు పని చేసే తీరుకి పెద్ద అభిమానిని. నువ్వు కూడా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరికొన్ని విజయాలను అందుకొని, ఇంకా ఎంతమందికి నువ్వు స్ఫూర్తిగా నిలబడాలి’ అంటూ ప్రశంసించాడు అమితాబ్ బచ్చన్. ఈ ట్వీట్ కి మంచి రీచ్ వచ్చింది.
అల్లు అర్జున్ వెంటనే స్పందిస్తూ ‘సార్..మీరు నా సూపర్ హీరో..చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూస్తూనే పెరిగాను. మీలాంటి లెజెండ్ నుండి ఇలాంటి ప్రశంసలు రావడం నేను చేసుకున్న అదృష్టం. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాపై మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు ధన్యవాదాలు సార్’ అని అంటాడు. వీళ్లిద్దరి ట్విట్టర్ సంభాషణ చూసేందుకు అభిమానులకు ఎంతో బాగా అనిపించింది. అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ అల్లు అర్జున్ అభిమానిని అని చెప్పడానికి మించిన ఎలివేషన్ ఏముంటుంది అని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు గర్వం గా చెప్పుకుంటున్నారు. అమితాబ్ బచ్చ కేవలం అల్లు అర్జున్ గురించి మాత్రమే కాదు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇలా ఎంతో మంది తెలుగు సూపర్ స్టార్స్ గురించి గతంలో గొప్పగా మాట్లాడాడు. దీనిని బట్టి అమితాబ్ బచ్చన్ కి తెలుగు హీరోలంటే ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు.