Game Changer Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అభిమానులు ఈ సినిమా విడుదల కోసం దాదాపుగా మూడేళ్ళ పాటు ఎదురు చూసారు. షూటింగ్ సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఎలాంటి బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా, నిర్లక్ష్య ధోరణితో శంకర్(Director Shankar) వ్యవహరించడం వల్ల దాదాపుగా 5 గంటల ఫుటేజీ వచ్చింది. దానిని ఫైనల్ ఎడిటింగ్ లో రెండు గంటల 40 నిమిషాలకు కుదించారు. దీంతో సినిమా మొత్తం చూసే వాళ్లకు అతుకుల బొంత లాగా అనిపించింది. అందుకే మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకొని, 50 శాతం నష్టాలను తెచ్చిపెట్టింది. ఓటీటీ లో విడుదలయ్యాక కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేస్తూ ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు.
నెటిజెన్స్ లో ప్రతీ సినిమాని ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఎవరైతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసారో, వాళ్ళే ట్రోల్స్ చేయడం ఎక్కడైనా చూశామా?, గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. సినిమా భారీ హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఇంత డబ్బులు పెట్టారు. థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీ లో మంచిగానే ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమా లో తప్పు చేసిన ఆఫీసర్స్ ని రామ్ చరణ్ ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉండే సన్నివేశాలు మీకు గుర్తు ఉండే ఉంటుంది. దానిని శంకర్ గ్రాఫిక్స్ రూపంలో సస్పెండ్ అయిన ఆఫీసర్స్ ని పైకి ఎగిరిపోయేలా చేస్తాడు. ఈ సన్నివేశాలను చిన్న బిట్ వీడియో రూపం లో అప్లోడ్ చేసి, బ్యాక్ గ్రౌండ్ లో ‘̶̶̶̶̶ ooooi’ed’ అంటూ విచిత్రమైన శబ్దంతో ఒక మ్యూజిక్ ని అటాచ్ చేసారు.
దీనిని రామ్ చరణ్ దురాభిమానుల సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో షేర్ చేస్తూ, సొంత సినిమాని ట్రోల్ చేయడం ఏంటిరా అని వెక్కిరిస్తున్నారు. ఈ వీడియో ని అమెజాన్ ప్రైమ్ వాడు ఏ ఉద్దేశ్యంతో వేశాడో తెలియదు కానీ , పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మాత్రం మారింది. కనీసం నెగటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత అయినా తొలగిస్తాడనుకుంటే అసలు తొలగించలేదు. రామ్ చరణ్ కి బలహీనమైన పీఆర్ టీం ఉండడం వల్లే ఆ ట్వీట్ ఇంకా డిలీట్ అవ్వలేదని, గతం లో ఎన్టీఆర్ గురించి కూడా నెట్ ఫ్లిక్స్ ఇలాంటి ట్వీట్ ఒకటి వేస్తె, వెంటనే పీఆర్ టీం స్పందించి ఆ ట్వీట్ ని తొలగింపజేసేలా చేసారు. కానీ ‘గేమ్ చేంజర్’ విషయంలో అలాంటిదేమి జరగలేదు, చరణ్ కి బలమైన పీఆర్ టీం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు.
̶̶̶̶̶ ooooi’ed#GameChangerOnPrime, Watch Now pic.twitter.com/KVnCnZB7nc
— prime video IN (@PrimeVideoIN) February 15, 2025