https://oktelugu.com/

Amar Deep Remuneration : స్టార్ మా నుండి భారీగా ఛార్జ్ చేసిన అమర్ దీప్… ఎన్ని లక్షలు ఇచ్చారో తెలుసా?

ప్రస్తుతం అమర్ దీప్ కు బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ గురించి పలురకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ..

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2023 / 08:36 PM IST
    Follow us on

    Amar Deep Remuneration : బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే గత ఆదివారం సెలెబ్రెటీలతో ఎంతో సందడిగా జరిగింది. ఇక టాప్ 6 కంటెస్టెంట్స్ ఒక్కొకరిగా ఎలిమినేట్ అయిపోయారు. కాగా చివరికి పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ టాప్ 2 నిలిచారు. అయితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. దీంతో అమర్ దీప్ రన్నర్ గా మిగిలిపోయాడు. నిజానికి అమర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందే సోషల్ మీడియాలో అతడే విన్నర్ అవుతాడనే చర్చాం నడిచింది.

    కానీ అతను తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు వల్ల కాస్త నెగిటివ్ అయ్యాడు. ‘ నేను ఈ ఇంట్లో నుంచి పోతే కప్పు కొట్టుకునే పోతా ‘ అంటూ ఛాలెంజ్ చేసిన అమర్ దీప్ రన్నర్ తో సరిపెట్టుకున్నాడు. అయితే అతనికి కప్పు దక్కక పోయిన .. అంత కంటే విలువైన బంపర్ ఆఫర్ కొట్టేసాడు. కాగా అతనికి తన అభిమాన నటుడు హీరో రవితేజ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఈ విషయాన్ని నాగార్జున గ్రాండ్ ఫినాలే స్టేజి పై నాగార్జున ప్రకటించారు.

    ప్రస్తుతం అమర్ దీప్ కు బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ గురించి పలురకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం .. అమర్ ఒక్కో వారానికి రూ. 2. 50 లక్షలు తీసుకున్నాడని తెలిసింది. అంటే అతను రోజుకు రూ. 35 వేలకు పైనే ఛార్జ్ చేసినట్లు సమాచారం. ఇక పదిహేను వారాలు పాటు ఉన్న అమర్ మొత్తంగా రూ. 37. 50 లక్షలు అందుకున్నది టాక్.

    కాగా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ కొందరు హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తో హౌస్ లోకి వెళ్లినా .. ఎక్కువ కాలం ఉండలేక పోయారు. దీంతో శివాజీ ఈ సీజన్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ గా నిలిచాడు. అతడికి మొత్తంగా రూ. 60 లక్షలకు పైగానే డబ్బు వచ్చింది. శివాజీ తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా అమర్ దీప్ నిలిచాడు.