Amardeep And Teju: పెళ్లి అనేది ప్రతి మనిషి చాలా అద్భుతమైన ఘట్టం. ఇద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుంటూ నిండు నూరేళ్ల వరకు కలిపి జీవించాల్సి ఉంటుంది. అయితే ప్రేమించుకున్నప్పుడు మాత్రం ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటుంది వేసుకున్న తర్వాత చిన్న చిన్న కారణాలకు విడిపోతున్న చాలామంది ఉన్నారు. అసలైన పెళ్లి తర్వాతే స్టార్ట్ అవుతుంది. కష్టాలైనా, బాధలైనా, ఎలాంటి సందర్భం అయినా ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసి ఏడాది తిరగకుండానే చిన్న చిన్న కారణాలకు విడిపోయి విడాకులు తీసుకున్న జంటలు చాలానే చూసుంటారు. అందులో ఎక్కువగా సెలెబ్రెటీలే ఉండడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. బుల్లితెర మీద ఆయన లేదా వెండి ధర మీద అయినా కలిసి జంటగా నటించిన వారు బయట కూడా పెళ్లి చేసుకుని ఎప్పటికీ కలిసి ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అలా బుల్లితెర ప్రేక్షకులు కోరుకునే సీరియల్ జంట అమర్ దీప్, తేజస్విని జంట. స్టార్ మా లో ప్రసారమయ్యే జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా అమర్ కు ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించింది. సీరియల్ మధ్యలో ఉన్న సమయంలోనే అమర్దీప్ కు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ కు ముందు ఎవరికి అంటగా తెలియని అమర్ దీప్ కు బిగ్ బాస్ తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ లో అమర్ ఆడిన ఆటతీరు అతని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఎలాగోలా బిగ్ బాస్ టాప్ 5 లో నిలబడి బయటకు వచ్చాడు. ఇక అమర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అతని తల్లి మరియు భార్య మీద బయట చాలా ట్రోల్స్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అమర్ భార్య తేజస్విని అమర్ కు చాలా సపోర్ట్ గా నిలబడింది. అమర్ తమ ఇంట్లో ఎలా ఉంటాడో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉన్నాడని తేజస్విని చెప్పుకొచ్చింది. అమర్ కూడా తను పెళ్ళికి ముందు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది తేజు కి చెప్పాను.
తను అర్థం చేసుకున్నందుకు తనకు చాలా రుణపడి ఉంటాను అని ఎమోషనల్ అయ్యాడు. బయట అమ్మాయిలతో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా తేజు మాత్రం తన ప్రాణం అని అమర్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఈ జంట ఓంకార్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఇస్మార్ట్ జోడి అని షోలో పాల్గొన్నారు. ఈ షోలో రియల్ లైఫ్ కపుల్స్ తో డాన్స్లు, ఆటలు ఇక అన్ని ఎమోషన్స్ ను కూడా చూపిస్తారు. గతవారం గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఇస్మార్ట్ జోడి షోలో అమర్ తన భార్య తేజుతో కలిసి పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో మేకర్ తాజాగా విడుదల చేశారు. వెడ్డింగ్ థీమ్ ఉండడంతో జంటలు తమ తమ సాంప్రదాయాలకు తగ్గట్లుగా దుస్తులను ధరించారు. ఓంకార అడిగిన ప్రశ్నలకు ప్రతి జంట కూడా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు.
ఇక ఓంకార్ అమర్, తేజు లకు 10 కుర్చీలు పెట్టి వారి మధ్య దూరం ఎంత ఉంది అని చూపించారు. ఓంకార్ భార్య భర్తలు గా మీరిద్దరూ 100% హ్యాపీగా ఉన్నారా అని అడిగితే అమర్, తేజు ఇద్దరు కూడా నో అని చెప్పి దూరంగా జరగడం మీరు ప్రోమోలో చూడవచ్చు. దీంతో వీరిద్దరి మధ్య ఏవైనా విభేదాలు ఉన్నాయా అంటూ నేటిజెన్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అమర్, తేజు తమ పెళ్లి గురించి ఎలాంటి విషయాలు చెప్తారో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.