Bigg Boss 9 Telugu Amar Deep And Ambati Arjun: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో వస్తున్నాని ట్విస్టులు ఏ సీజన్ లో కూడా రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత వారం జరిగిన భరణి ఎలిమినేషన్ ఆడియన్స్ ని ఎంత ఎమోషన్ కి గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనకు ఓట్లు వేయని వారు కూడా, అయ్యో మంచి వ్యక్తిని బిగ్ బాస్ నుండి బయటకు పంపేసామే అని బాధపడ్డారు. ఇక అంతకు ముందు వారం జరిగిన శ్రీజ ఎలిమినేషన్ మాత్రం చాలా అన్యాయం. ఇది బిగ్ బాస్ చరిత్రలో మాయని మచ్చ లాగా మిగిలిపోతుంది. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాకుండా, వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఓటింగ్ తో శ్రీజ ని ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయం అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున ఆమె కోసం నిలబడి పోరాడారు.
రీ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ, అది దాదాపుగా అసాధ్యమే అని తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ కూడా రాబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అమర్ దీప్ ని బిగ్ బాస్ టీం సంప్రదించిన విషయం వాస్తవమే, కానీ ఎందుకో ఆయన రావడానికి చివరి నిమిషం లో ఒప్పుకోలేదు. కానీ అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం చూస్తే అమర్ దీప్ నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి తన తోటి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ తో కలిసి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఇదేమి ట్విస్ట్ సామీ, సడన్ గా వీళ్ళ ఎంట్రీ ఏంటి?, హౌస్ లోనే ఉండిపోతారా?, లేదంటే కేవలం ఒక్క రోజు ఉండి వెళ్తారా అని నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే వీళ్ళు కేవలం హౌస్ లోకి టాస్కులు నిర్వహించడానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో గ్యాంగ్ వార్స్ అనే టాస్క్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాస్క్ ద్వారా కెప్టెన్సీ కంటెండర్లు గా కొంతమంది మిగులుతారు. వీళ్లకు కెప్టెన్సీ టాస్క్ ని నిర్వహించడానికి వీళ్లిద్దరు ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంబటి అర్జున్ , అమర్ దీప్ లది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ 7 వీళ్లిద్దరి మధ్య జరిగే ఎన్నో సన్నివేశాలు ఆడియన్స్ చేత నవ్వులు పూయించాయి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ గా వీళ్లిద్దరు చేసిన కామెడీ బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పటికీ మిగిలిపోతాది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ హౌస్ మేట్స్ తో కలిస్ ఎలాంటి సందడి చేయబోతుంది అనేది చూడాలి. ఈ ఎపిసోడ్ రేపు మనకు టీవీ లో టెలికాస్ట్ అవ్వొచ్చు.