https://oktelugu.com/

Amala Paul: రెండో పెళ్లికి సిద్ధమైన అమలా పాల్… ప్రియుడి ఘాటు రోమాంటిక్ వైరల్

బెజవాడ అంతగా ఆడలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి 2013లో రీఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ కి జంటగా నాయక్ చేసింది. ఇది ఓ మోస్తరు విజయం అందుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2023 / 06:13 PM IST

    Amala Paul

    Follow us on

    Amala Paul: హీరోయిన్ అమలాపాల్ సంచలన ప్రకటన చేసింది. ఆమె రెండో పెళ్ళికి సిద్ధం అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ కి ఆమె ఎస్ చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. కేరళకు చెందిన అమలా పాల్ మైనా చిత్రంతో ఫేమస్ అయ్యింది. ఆ ట్రాజిక్ లవ్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో విజయం అందుకుంది. ఇక తెలుగులో అమలా పాల్ మొదటి చిత్రం బెజవాడ. అక్కినేని నాగ చైతన్యకు జంటగా నటించింది. విజయవాడ నగరంలో జరిగే ఆధిపత్య పోరు ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు.

    బెజవాడ అంతగా ఆడలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి 2013లో రీఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్ కి జంటగా నాయక్ చేసింది. ఇది ఓ మోస్తరు విజయం అందుకుంది. వివి వినాయక్ దర్శకుడు. అల్లు అర్జున్ కి జంటగా ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలో హోమ్లీ రోల్ చేసింది. ఈ సినిమా కూడా పర్లేదు అనిపించింది. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించండి.

    2014లో విజయ్-అమలా పాల్ వివాహం చేసుకున్నారు. ఓ మూడేళ్లు కాపురం సవ్యంగానే సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో విడిపోయారు. 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విజయ్ తో విడిపోయాక కూడా ఆమెపై ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. సింగర్ భవీందర్ సింగ్ తో పెళ్లి అయినట్లు పుకార్లు వినిపించాయి. భవీందర్, అమలా పాల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది ఫొటో షూట్ అని అమలా పాల్ కొట్టిపారేసింది.

    తాజాగా జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్ కి ఆమె అంగీకారం తెలిపింది. ఇద్దరు లిప్ కిస్ లు చేసుకున్నారు. జగత్ దేశాయ్ ఈ వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. తన కలల రాణి పెళ్ళికి ఒప్పుకుందని కామెంట్ చేశాడు. మ్యారేజ్ బెల్స్ అంటూ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇక జగత్ దేశాయ్ వ్యాపారవేత్త అని తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అని సమాచారం. ప్రస్తుతం మూడు మలయాళ చిత్రాలతో అమలా పాల్ బిజీగా ఉంది.