Samantha : విడాకుల విషయంలో సమంతని నెటిజెన్స్ తిట్టడం కరెక్టే.. అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఆమె పాపులారిటీ వ్యాప్తి చెంది, ఇప్పుడు వరుసగా అక్కడే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తుంది. మరోపక్క నాగ చైతన్య కూడా చేతినిండా సినిమాలతో ఊపిరి సలపనంతా బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వం లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక భారీ సినిమా చేస్తున్నాడు.

Written By: NARESH, Updated On : June 24, 2023 11:57 am
Follow us on

Samantha : సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో ఉండే పేర్లు సమంత – నాగచైతన్య. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటి నుండి విడిపోయే వరకు ప్రతీ ఒక్కటి సెన్సేషనే. పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళ గురించి సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలకంటే కూడా, విడిపోయిన తర్వాత ప్రచారమైన వార్తలే ఎక్కువ. వాళ్లిద్దరూ విడిపోయారనే విషయం వాళ్ళు కూడా మర్చిపోయారు. సమంత తన సినిమాలతో తాను ఫుల్ బిజీ అయ్యింది.

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఆమె పాపులారిటీ వ్యాప్తి చెంది, ఇప్పుడు వరుసగా అక్కడే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తుంది. మరోపక్క నాగ చైతన్య కూడా చేతినిండా సినిమాలతో ఊపిరి సలపనంతా బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వం లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక భారీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

అలా ఎవరి వ్యక్తిగత జీవితం లో వారు బిజీ గా ఉంటున్నారు. కానీ వీళ్ళ గురించి న్యూస్ లు రావడం మాత్రం ఆగడం లేదు. ఇకపోతే రీసెంట్ గా అక్కినేని అమల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా లో సమంత మరియు నాగ చైతన్య మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ పై ఆమె స్పందిస్తూ ‘సెలబ్రిటీ జీవితం అన్న తర్వాత మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం సహజం. దానిని మనం మార్చలేము, సమంత మరియు నాగ చైతన్య విడాకులేమి గోప్యంగా జరగలేదు. పబ్లిక్ గానే జరిగింది, మరి దాని గురించి నెటిజెన్స్ అభిప్రాయాలను స్వీకరించడం కూడా మన బాధ్యత, కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నాను’ అంటూ అమల చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.